NFL
-
రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ స్టార్ల పెట్టుబడులు
ముంబై: విశ్వవ్యాప్త ఆదరణతో టాప్ క్రికెట్ లీగ్‌గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు అమెరికన్ల పెట్టుబడుల్ని ఆకర్షించడంలో సఫలమైంది. ఐపీఎల్ తొలి చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) దిగ్గజం లారీ ఫిట్జెరాల్డ్, స్టార్ ప్లేయర్ కెల్విన్ బీచుమ్, నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) స్టార్ క్రిస్ పాల్ పెట్టుబడులు పెట్టారు. ‘అమెరికా ఎలైట్ అథ్లెట్లు క్రిస్ పాల్, ఫిట్జెరాల్డ్, కెల్విన్‌లను పెట్టుబడులు పెట్టేలా మా ఫ్రాంచైజీ ఆకర్షించింది. ఈ ముగ్గురు తాజాగా మా స్టేక్ హోల్డర్ల జాబితాలో చేరారు. మైనార్టీ ఇన్వెస్టర్లుగా మా బోర్డులో భాగమయ్యారు’ అని రాజస్తాన్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. మనోజ్ బదాలేకు చెందిన ‘ఎమర్జింగ్ మీడియా వెంచర్స్’ ఈ ఫ్రాంచైజీ యజమాని కాగా... అమెరికన్ దిగ్గజాలు తమ ఫ్రాంచైజీలో భాగస్వాములవడం సంతోషంగా ఉందని బదాలే అన్నారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. పెద్ద స్టార్లతో గొప్ప మేలే జరుగుతుందన్నారు. ‘రాజస్తాన్‌ను ఓ ప్రొఫెషనల్ ఫ్రాంచైజీగా తయారు చేయాలనే ఆలోచనతో ఇందులో భాగమయ్యాను’ అని ఫిట్జెరాల్డ్ తెలిపాడు. ఐపీఎల్ ఎంతగా ఎదిగిందో తెలుసని, విలువ పరంగా ఈ లీగ్ అంతకంతకూ వృద్ధి చెందుతోందని, నిజంగా ఇలాంటి విశేష ప్రాచుర్యంగల లీగ్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉందని క్రిస్ పాల్ అన్నాడు. రాయల్స్ ఇటీవల విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది బార్బడోస్ ట్రైడెంట్స్, సీఎంజీ కంపెనీలు రాజస్తాన్‌లో పెట్టుబడులు పెట్టాయి. -
ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన 'జార్వో' మళ్లీ వచ్చేశాడు..
Cricket Pitch Invader Jarvo Intrudes Field Once Again In NFL Match: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐపీఎల్-2021కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో పదేపదే మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధించిన ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69 గుర్తున్నాడా..? అదేనండి తాను కూడా టీమిండియా ఆటగాడినే అంటూ నానా హంగామా చేసిన వ్యక్తి. ఆ సిరీస్‌లో మూడు సార్లు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లోకి వచ్చి ఇంగ్లండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడంతో జార్వోను ఇంగ్లండ్ పోలీసులు అరెస్ట్ కూడా చేసారు. తాజాగా అదే వ్యక్తి మరోసారి మైదానంలోకి దూసుకొచ్చి వార్తల్లోకెక్కాడు. Random guy on the field at the London game dapping players up in a Jaguars jersey pic.twitter.com/FP2kF13Tnt — Barstool Sports (@barstoolsports) October 17, 2021 అయితే ఈసారి అతను ఎంట్రీ ఇచ్చింది క్రికెట్ మైదానంలోకి కాదు. లండన్‌లో జరుగుతున్న అమెరికన్ ఫుట్‌బాల్(NFL) మ్యాచ్ మధ్యలోకి. జాక్సన్ విల్లే జాగ్వార్స్, మయామీ డాల్ఫిన్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతుండగా.. జార్వో, జాగ్వార్స్ జెర్సీ ధరించి ఒక్కసారిగా మైదాన ప్రవేశం చేశాడు. తాను కూడా జాక్సన్ జాగ్వార్స్ ఆటగాడినే నంటూ గతం తరహాలోనే నానా హంగామా చేశాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని మైదానంలో నుంచి లాక్కెల్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f — Raghav Padia (@raghav_padia) September 3, 2021 చదవండి: T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
గోద్రెజ్ ప్రాపర్టీస్ బోర్లా- ఎన్ఎఫ్ఎల్ ఖుషీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో రియల్టీ కంపెనీ గోద్రెజ్ ప్రాపర్టీస్ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో(ఏప్రిల్- అక్టోబర్) నాన్యూరియా ఫెర్టిలైజర్స్ అమ్మకాలు జోరందుకోవడంతో నేషనల్ ఫెర్టిలైజర్స్(ఎన్ఎఫ్ఎల్) కౌంటర్‌కు డిమాండ్ కనిపిస్తోంది. వెరసి గోద్రెజ్ ప్రాపర్టీస్ కౌంటర్ భారీ నష్టాలతో కళ తప్పగా.. ఎన్ఎఫ్ఎల్ భారీ లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. గోద్రెజ్ ప్రాపర్టీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో గోద్రెజ్ ప్రాపర్టీస్ నికర లాభం 78 శాతం క్షీణించి రూ. 7 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 65 శాతం నీరసించి రూ. 90 కోట్లకు చేరింది. పన్నుకు ముందు లాభం 69 శాతం పడిపోయి రూ. 22.6 కోట్లను తాకింది. ఈ నేపథ్యంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9.3 శాతం కుప్పకూలి రూ. 1,036 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,030 వరకూ వెనకడుగు వేసింది. ఎన్ఎఫ్ఎల్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలల్లో అన్నిరకాల యూరియాయేతర ఎరువుల అమ్మకాలు జోరందుకున్నట్లు నేషనల్ ఫెర్టిలైజర్స్ తెలియజేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే తదితర ఎరువుల వాడకంలో రైతులకు కంపెనీ ఇస్తున్న శిక్షణ ఇందుకు దోహదం చేసినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా పానిపట్‌లో తయారైన బెంటోనైట్ సల్ఫర్ అమ్మకాలు 3478 ఎంటీ నుంచి 11,730 ఎంటీకి ఎగశాయి. ఇదేవిధంగా ఎస్ఎస్పీ విక్రయాలు 6323 ఎంటీ నుంచి 14,726 ఎంటీకి పెరిగాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎఫ్ఎల్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 9 శాతం దూసుకెళ్లి రూ. 32.5 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 34 వరకూ ఎగసింది. -
కోవిడ్‌తో మెదడుకు నష్టం?
బెర్లిన్: కోవిడ్ కారణంగా మెదడు దెబ్బతింటుందా? అవునంటున్నారు స్వీడన్‌లోని గొథెన్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వ్యాధి చికిత్సకు ఆసుపత్రిలో చేరిన కొందరిలో తాము మెదడు దెబ్బతిన్న ఆనవాళ్లను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తేలికపాటి, ఒక మోస్తరు, తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన 47 మందిపై తాము పరిశోధనలు చేశామని వారి రక్త నమూనాలను పరిశీలించినప్పుడు మెదడు దెబ్బతినేందుకు సూచికలైన కొన్ని రసాయనాలను గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతోపాటు మెదడు నాడుల కొనలలో ఉండే ఎన్ఎఫ్ఎల్ అనే మరో ప్రొటీన్ కూడా రక్తంలో కనిపించిందని చెప్పారు. కోవిడ్ –19 కారణంగా వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన రోగుల్లో ఈ ఎన్ఎఫ్ఎల్ చాలా ఎక్కువగా కనిపించిందని, దీనికి వ్యాధి తీవ్రతకు సంబంధం ఉందన్న విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చునని చెప్పారు. -
యూరియా స్కాంలో 100 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: 23 ఏళ్లనాటి రూ.133 కోట్ల యూరియా కుంభకోణంలో తీస్ హజారీ ప్రత్యేక సీబీఐ కోర్టు దోషులకు భారీ జరిమానాతోపాటు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇద్దరు టర్కీ దేశస్తులకు ఆరేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బంధువు, మాజీ కేంద్ర మంత్రి తనయుడు సహా ఈ కేసుతో సంబంధమున్న భారతీయులకు భారీ జరిమానా విధించింది. టర్కీ దేశస్తులు టుంకే అలంకుస్, సిహాన్ కరాంచీ (వీరిద్దరూ కర్సాన్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు)లతోపాటు ఆ కంపెనీ భారతీయ ప్రతినిధి ఎం సాంబశివరావు, నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ (ఎన్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ రామకృష్ణన్, ఎన్ఎఫ్ఎల్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిల్బాగ్ సింగ్ కన్వర్, మల్లేశం గౌడ్, మాజీ కేంద్ర మంత్రి రామ్‌లఖన్ సింగ్ యాదవ్ కుమారుడు ప్రకాశ్ చంద్ర, మాజీ ప్రధాని పీవీ బంధువు సంజీవ రావు ఈ కేసులో దోషులుగా ఉన్నారు. రామకృష్ణ, కన్వర్‌లకు మూడేళ్ల జైలు, రూ.6లక్షల జరిమానా, సాంబశివరావుకు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, మల్లేశం గౌడ్‌కు మూడేళ్ల జైలు, రూ.5కోట్ల జరిమానా, సంజీవరావ్, యాదవ్‌లకు కోటి రూపాయల జరిమానా మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కుంభకోణం కేసేంటి? ఈ కేసులో పేర్కొన్న వారంతా నేరపూరిత కుట్రతో ఎన్‌ఎఫ్‌ఎల్‌ను రూ.133 కోట్ల మేర మోసం చేశారంటూ 1996, మే 19న సీబీఐ కేసు నమోదు చేసింది. ‘టర్కీ దేశస్తుడైన అలంకుస్ ఎన్ఎఫ్ఎల్కు యూరియా సరఫరా చేసేందుకు కర్సాన్ లిమిటెడ్ కంపెనీ తరపున ఒప్పందం చేసుకున్నాడు. మెట్రిక్ టన్నుకు 190 డాలర్ల చొప్పున 2లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకోసం ముందుగానే 100% చెల్లించాలని ఒప్పందంలో ఉంది. దీని విలువ దాదాపుగా రూ.133 కోట్లు. నవంబర్ 2, 1995న అలంకుస్కు 3.8లక్షల డాలర్లు బీమా అడ్వాన్స్‌గా చెల్లించారు. మిగిలిన 3.76 కోట్ల డాలర్లను కర్సాన్ కంపెనీ అకౌంట్లోకి 1995లో జమచేశారు. అయితే ఈ కంపెనీ ఎన్ఎఫ్ఎల్కు యూరియాను పంపలేదు. కుంభకోణం నేపథ్యం.. 1995,సెప్టెంబర్: యూరియా సరఫరాకు అంతర్జాతీయ టెండర్ల ఆహ్వానం 1996 మార్చి: టర్కీ కంపెనీ కార్సాన్కు రూ.133 కోట్ల చెల్లింపు 1996 మే: యూరియా సరఫరా చేయకపోవడంపై సీబీఐ విచారణకు ఆదేశం 1996 ఆగస్టు: కంభకోణంలో వెలుగులోకి పీవీ కొడుకు ప్రభాకర్ రావు పేరు 1998 నవంబర్: ప్రభాకర్ రావు అరెస్టు -
రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ!
న్యూఢిల్లీ: రామగుండం ఎరువుల ప్లాంటు పునరుద్ధరణ చర్యలు వేగవంతం అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ ఫెర్టిలైజర్స్ (ఎన్ఎఫ్ఎల్), ఇంజినీర్స్ ఇండియా (ఈఐఎల్), ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐఎల్) కలిసి బుధవారం జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేయనున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 5,000 కోట్లుగా ఉండనుందని ఎన్ఎఫ్ఎల్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలిపింది. రామగుండం ఎరువుల కర్మాగారం కరీంనగర్ జిల్లాలో ఉంది. కార్యకలాపాలు లాభదాయకంగా లేకపోవడంతో 1999 నుంచి ఇందులో యూరియా, అమోనియా ఉత్పత్తిని నిలిపివేశారు. అయితే, మూతబడిన ఎఫ్‌సీఐఎల్ యూనిట్లను పునరుద్ధరించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో రామగుండం ప్లాంటు కూడా తెరపైకి వచ్చింది. పునరుద్ధరణ ప్రణాళిక ప్రకారం రోజుకూ 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యంతో కాంప్లెక్స్‌ను తీర్చిదిద్దనున్నారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తి కాగలదని ఎన్ఎఫ్ఎల్ పేర్కొంది. దీనికి అవసరమైన నిధుల్లో ఎన్ఎఫ్ఎల్ 26 శాతం సమకూరుస్తుంది. ప్లాంటుకు అవసరమైన సహజ వాయువును ప్రతిపాదిత మల్లవరం-భిల్వారా పైప్‌లైన్ ద్వారాను, నీటి వనరులను గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి అందించనున్నారు.