Cricket Pitch Invader Jarvo Intrudes Field Once Again In NFL Match: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐపీఎల్-2021కు ముందు జరిగిన టెస్ట్ సిరీస్‌లో పదేపదే మైదానంలోకి చొరబడి ఇంగ్లండ్ ఆటగాళ్లను వేధించిన ప్రాంక్ యూట్యూబర్ జార్విస్ అలియాస్ జార్వో 69 గుర్తున్నాడా..? అదేనండి తాను కూడా టీమిండియా ఆటగాడినే అంటూ నానా హంగామా చేసిన వ్యక్తి. ఆ సిరీస్‌లో మూడు సార్లు మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‌లోకి వచ్చి ఇంగ్లండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడంతో జార్వోను ఇంగ్లండ్ పోలీసులు అరెస్ట్ కూడా చేసారు. తాజాగా అదే వ్యక్తి మరోసారి మైదానంలోకి దూసుకొచ్చి వార్తల్లోకెక్కాడు.
Random guy on the field at the London game dapping players up in a Jaguars jersey pic.twitter.com/FP2kF13Tnt
— Barstool Sports (@barstoolsports) October 17, 2021
అయితే ఈసారి అతను ఎంట్రీ ఇచ్చింది క్రికెట్ మైదానంలోకి కాదు. లండన్‌లో జరుగుతున్న అమెరికన్ ఫుట్‌బాల్(NFL) మ్యాచ్ మధ్యలోకి. జాక్సన్ విల్లే జాగ్వార్స్, మయామీ డాల్ఫిన్స్ మధ్య ఆదివారం మ్యాచ్ జరుగుతుండగా.. జార్వో, జాగ్వార్స్ జెర్సీ ధరించి ఒక్కసారిగా మైదాన ప్రవేశం చేశాడు. తాను కూడా జాక్సన్ జాగ్వార్స్ ఆటగాడినే నంటూ గతం తరహాలోనే నానా హంగామా చేశాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని మైదానంలో నుంచి లాక్కెల్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.
Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f
— Raghav Padia (@raghav_padia) September 3, 2021
చదవండి: T20 WC 2021: భారత్-పాక్ మ్యాచ్‌పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment