Ohio University
-
Corona: కొవిడ్ పేషెంట్లకు ఎమర్జెన్సీ టైంలో..
కరోనా చికిత్స సమయంలో పేషెంట్ల పరిస్థితి ఒక్కసారిగా తిరగబడిన సందర్భాలు ఉంటున్నాయి. ఆ టైంలో అప్రమత్తం అయ్యే లోపే ప్రాణాల మీదకు వస్తోంది. ఈ తరుణంలో పేషెంట్ల ప్రాణాలను కాపాడగలిగే అత్యాధునిక సాంకేతికతను రూపొందించారు భారత సంతతికి చెందిన అనంత్ మాడభూషి. ఓహియో క్లీవ్‌లాండ్‌లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలో ‘కంప్యూటేషనల్ ఇమేజింగ్ అండ్ పర్సనలైజ్డ్ డయగ్నోస్టిక్స్’ ఎక్స్‌పర్ట్‌గా అనంత్ మాడభూషి. ఈయన డెవలప్ చేసిన ఏఐ టెక్నాలజీ ఇప్పుడు కొవిడ్ పేషెంట్లకు ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడనుంది. కొవిడ్ పేషెంట్‌కు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తినప్పుడు.. ఈ ఏఐ టూల్ వెంటనే అప్రమత్తం చేస్తుంది. పేషెంట్‌కు వెంటిలేటర్ అవసరమని సూచిస్తుంది. తద్వారా పేషెంట్ల ప్రాణాలు కాపాడొచ్చని ఆయన చెప్తున్నారు. డీప్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీల సాయంతో ఈ టూల్‌ను రూపొందించారు ఆయన. అమెరికా, వుహాన్(చైనా)లో 2020లో నమోదు అయిన 900 మంది కొవిడ్ పేషెంట్ల సీటీ స్కాన్లను ఆధారం చేసుకుని ఈ టెక్నాలజీని డెవలప్ చేశారు. ‘‘ఈ టెక్నాలజీ.. కొవిడ్ 19 పేషెంట్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో ఫిజిషియన్స్ను అప్రమత్తం చేస్తుంది. పేషెంట్‌కు, వాళ్ల కుటుంబ సభ్యులకు పరిస్థితి అప్డేట్ అందిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఆస్పత్రికి ఎన్ని వెంటిలేటర్స్ అవసరం అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎర్లీ స్టేజ్‌లోనే గుర్తించి అప్రమత్తం చేస్తోందని, 84 శాతం సక్సెస్ రేటు చూపిస్తున్న ఈ టూల్‌ను త్వరలోనే వినియోగంలోకి తేనున్నామని పరిశోధకులు వెల్లడించారు. ముందుగా యూనివర్సిటీ ఆస్పత్రుల్లో, లూయిస్ స్టోక్స్ క్లీవ్‌లాండ్ వీఏ మెడికల్ సెంటర్లో వీటిని రియల్ టైంలో ఉపయోగించనున్నారు. క్లౌడ్ బేస్డ్ యాప్ఎమర్జన్సీ యూనిట్లకు వీటిని అనుసంధానిస్తారు. చదవండి: డ్రైవింగ్ సీట్లో నిద్ర..రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసే డివైజ్ -
నవ్వుల సడినీ, విషాదపు తడినీ కొలిచేస్తారు సుమండీ!
వర్షించే మేఘాలనూ, శీతాకాలం వణికించే మంచురాత్రులనూ, సెగలుపుట్టించే వేసవి వేడినీ కొలిచే సాధనాలున్నాయి. కానీ ఇప్పుడు ప్రపంచ మానవాళి ముఖకవళికలను బట్టి వారిలోని ఆనందాశ్చర్యాలకూ లెక్కకట్టేస్తున్నారు పరిశోధకులు. మీలోని దుఃఖాన్నీ, ఆనందాన్నీ, కోపాన్నీ, విషాదాన్నీ స్కేల్‌తో కొలిచిమరీ మీ అభివ్యక్తిని ఇట్టే పట్టేస్తారు. నిజంగా మీరు సంతోషంగా ఉన్నారా? ఉంటే ఎంత సంతోషంగా ఉన్నారు? కోపమా? అయితే దాని బరువెంత? ఇలా మీ ముఖాన విరిసే అన్ని హావభావాలనూ ముఖ కండరాల కదలికలను బట్టి అంచనా కట్టేస్తున్నాయి తాజా అధ్యయనాలు. అలా లెక్కలు వేసే ప్రపంచంలో ఎన్ని రకాల నవ్వులు పూయించొచ్చో, ఎన్ని రకాలుగా మీలోని కోపాన్ని ప్రదర్శిస్తున్నారో తేల్చి చెప్పేశారు. ఆనందానికి 17 వ్యక్తీకరణలు.. ప్రపంచవ్యాప్తంగా మనుషులు విసుగుని ప్రదర్శించడానికి ఒకే ఒక్క ముఖ కవళిక ఉందట. కానీ మనలోని సంతోషాన్నీ, ఆనందాన్నీ, ఉట్టిపడే ఉల్లాసాన్నీ 17 రకాలుగా మనం వ్యక్తీకరిస్తున్నట్టు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే మనలో భయాన్ని మాత్రం కేవలం మూడు రకాలుగా ప్రదర్శిస్తున్నాం. ఆశ్చర్యాన్ని నాలుగురకాలుగా అభివ్యక్తీక రిస్తే, ప్రపంచ ప్రజలంతా తమలోని కోపాన్నీ, విషాదాన్నీ మాత్రం ఐదు విభిన్న ముఖ కవళికల ద్వారా, ముఖాకృతుల ద్వారా ప్రదర్శిస్తున్నారు. మన ముఖంలోని కండరాల కదలికలను బట్టి మన నవ్వునీ, నవ్వుతున్న ప్పుడు మన కళ్ళ దగ్గర పడే చర్మపు ముడతలని బట్టి మనలోని ఆనందాన్ని చాలా సునాయాసంగా కొలిచేయొచ్చంటున్నారు పరిశోధకులు. ‘‘ఈ పరిశోధన చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే సంతోషంలోని క్లిష్టమైన విషయాలెన్నింటినో ఇది విడమరిచి చెప్పింది’’అని ఓహియో యూనివర్సిటీ అధ్యాపకులు అలెక్సీ మార్టినెజ్ పేర్కొన్నారు. 35 రకాల ఎమోషన్స్ కామన్ మనుషులు తమలోని ఆనందం, కోపం, సంతోషం, దుఃఖం, విషాదం లాంటి ఉద్విగ్నభరిత క్షణాలను వేనవేల రకాలుగా వ్యక్తీకరిస్తుంటారు. అయితే అందులో కేవలం 35 రకాల అభివ్యక్తులు మాత్రమే ఉంటాయని ఈ పరిశోధన తేల్చి చెప్పింది. వివిధ రకాల ఫీలింగ్స్‌ని వివరించే 821 రకాల పదాలను ఇంటర్నెట్లో పరిశోధించి వాటిని మనుషుల ముఖాభినయాలతో పోల్చి చూసినట్టు ఐఈఈఈ జర్నల్‌లో ప్రచురించిన వ్యాసంలో వివరించారు. స్పానిష్లోనూ, చైనా భాషలోకీ, పార్సీ, రష్యన్ మొదలుకొని ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియాల్లోని మొత్తం 31 దేశాల భాషల్లోకి ఈ పదాలను అనువదించి సంబంధిత ముఖచిత్రాలతో పోల్చి చూశారు. ఈ అధ్యయనంలో దాదాపు 72 లక్షల ఫొటోల్లోని ముఖాభినయాలను పరిశీలించారు. అయితే కంప్యూటర్ ఆల్గరిథమ్స్ ఆధారంగా ముఖ కండరాల కదలికలను బట్టి 16,384 రకాలుగా మనుషులు తమలోని భావోద్వేగాలను వ్యక్తీకరించగలరని ఈ పరిశోధన తేల్చి చెప్పింది. అయితే 72 లక్షల ఫొటోలను పరిశీలించిన మీదట అందులో 35 రకాల ఎమోషన్స్ సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. -
పోర్టబుల్ టూల్ మైగ్రేన్‌కు చెక్!
పరిశోధన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న రోగులకు ఓ శుభవార్త. సైంటిస్టులు ఇప్పుడు కొత్త ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని తయారుచేశారు. ఈ పోర్టబుల్ ఉపకరణం అసలు నొప్పి మెుదలు కాకమందే పనిచేసి రాబోయే నొప్పిని నివారిస్తుందంటున్నారు దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు. మైగ్రేన్ వచ్చినప్పుడు తలనొప్పి తీవ్రత ఎంతో ఎక్కువగా ఉండటమే కాదు... కళ్ల మందు మెరుపులు, చుక్కలు కనిపించినట్లు అనిపించడం, దృష్టి మందగించిన అనుభూతి, బలహీనంగా ఉండటం, అయోమయంగా అనిపించడం... ఈ లక్షణాలన్నీ సాధారణంగా మైగ్రేన్ ఉన్నవాళ్లలో కనిపిస్తాయి. ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పితో పాటు కొందరిలో వికారం, వాంతులు కూడా ఉంటాయి.ఇలాంటి వాళ్ల కోసం ఒహియో యూనివర్సిటీ పరిశోధకులు ఓ ఎలక్ట్రానిక్ పరికరాన్ని రూపొందించారు. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లేలా రూపొందించిన ఈ ఉపకరణంతో తలనొప్పి నుంచి రోగులకు విముక్తి కలుగుతుందని ఈ పరిశోధనల వల్ల తేలిందని నేతృత్వం వహించిన శాస్త్రజ్ఞుడు యూసఫ్ మహ్మద్ తెలిపారు. ప్రస్తుతం మైగ్రేన్ తలనొప్పులతో బాధపడుతూ సంప్రదాయ చికిత్స తీసుకుంటున్నవారిలో కనీసం 50%–60% మందికి ఈ చికిత్స సాంత్వన కలిగిస్తుందని యూసఫ్ మహ్మద్ పేర్కొన్నారు. మైగ్రేన్ తలనొప్పి రాబోయేముందు మెదడులో జరిగే అలజడులను పసిగట్టే ఈ ‘ట్రాన్స్ క్రేనియల్ మ్యగ్నెటిక్ స్టిమ్యులేటర్’ అనే పరికరం... ఆ అలజడి తలనొప్పిగా రూపొందకముందే తగ్గిస్తుంది. ‘గతంలోనే ఈ ఉపకరణాన్ని తయారుచేశాం. అయితే అప్పుడు అది సైజ్‌లో వురింత పెద్దగా ఉంది. ఒకచోటి నుంచి మరో చోటికి తరలించేందుకు అనువుగా లేదు. అయితే ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకొని తీసుకెళ్లేంత సౌకర్యంగా తీర్చిదిద్దాం’ అంటున్నారు యూసఫ్ మహ్మద్. ఇంట్లో ఉంచుకునేందుకు వీలైన ఈ పరికరం త్వరలోనే మార్కెట్లోకి వస్తుందని ఆశించవచ్చు. -
ఇక ఏటీఎంలో పిజ్జాలు
ఆఖలేస్తే పిజ్జా కార్నర్ ఎక్కడ ఉందా..? అని ఇక వెతుకోవాల్సినవసరం లేదు. జేబులో ఏటీఎం కార్డు ఉంటే చాలు. ఏటీఎం నుంచే పిజ్జాను పొంది, ఎంచకా అక్కడే తినేయొచ్చట. ఉత్తర అమెరికాలో మొదటి పిజ్జా ఏటీఎంను ఓహియో యూనివర్సిటీలో ఆవిష్కరించారు. పిజ్జా ప్రియులకు సౌకర్యార్థం, సిన్సినాటిలోని జేవియర్ యూనివర్సిటీ(ఎక్స్‌యూ), ఫ్రెంచ్ కంపెనీ పాలైన్ భాగస్వామ్యంతో నార్త్ అమెరికాలో మొదటి పిజ్జా ఏటీఎంను తమ కాలేజ్ ఆవరణలో ఏర్పాటుచేసింది. ఎక్స్‌యూ డైనింగ్ హాల్‌కు బయట, ఫెన్విక్ స్థలంలో దీన్ని ఇన్ స్టాల్ చేశారు. ఈ ఏటీఎంలో 70 పిజ్జాల వరకు అందుబాటులో ఉంటాయని ఫ్రెంచ్ కంపెనీ చెబుతోంది.. కస్టమర్లు టచ్ స్క్రీన్ ఉపయోగించి, ఈ ఏటీఎం నుంచి పిజ్జాను పొందవచ్చని తెలిపింది. కస్టమర్ పిజ్జాను ఆర్డర్ చేసిన వెంటనే ఈ మిషన్ కొద్దిసేపు పాటు పిజ్జాను వేడిచేసి, అనంతరం స్లాట్ నుంచి కస్టమర్లకు అందిస్తోందని పాలైన్ కంపెనీ చెప్పింది. నార్త్ అమెరికాలో మొదటి పిజ్జా ఏటీఎంను ప్రారంభించినట్టు జేవియర్ కాలేజ్ డైనింగ్ హాల్ కూడా ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. ఈ ఏటీఎం నుంచి మొదటి పిజ్జా జేవియర్ మహిళల సాసర్ టీమ్‌కు సర్వ్ చేసినట్టు తెలిపింది. ఏటీఎం మొదటి పిజ్జాను ఎంజాయ్ చేసిన సాసర్ టీమ్ కూడా తమ సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. గత 14 ఏళ్లుగా యూరప్‌లో పాలైన్ సంస్థ పిజ్జా ఏటీఎం సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
పిల్లలు లేటుగా నిద్రపోతున్నారా.. జర జాగ్రత్త!
న్యూయార్క్: ఉదయాన్నే లేవడం చిన్నారులతో పాటు ఆఫీసుకు వెళ్లే పెద్దవాళ్లకు కాస్త బద్దకంగా అనిపిస్తోంది. అయితే స్కూల్‌కు వెళ్లే పిల్లల్లో చాలామంది ఉదయం లేవడానికి మారాం చేస్తుంటారు. ఇందుకు కారణం చాలా చిన్నదే. రాత్రిపూట త్వరగా పడుకోకపోవడమే. ఇలాంటి పిల్లలు పెద్దయ్యాక ఊబకాయంతో పాటు ఇతర రోగాల బారినపడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఓహియో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు 977 మంది పిల్లలపై అధ్యయనం చేసి ఆ వివరాలను వెల్లడించారు. పిల్లలు ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే రాత్రికి త్వరగా నిద్రపోయేలా చూడటమే సరైన మార్గమని సూచిస్తున్నారు. రాత్రి 8 గంటలలోపు పడుకోబెట్టడడం, ఉదయం త్వరగా లేపడం వల్ల ఉబకాయం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయని వివరించారు. రాత్రి 9 గంటలు దాటాక నిద్రపోయే పిల్లలు ఊబకాయంతోపాటు అనేకరకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయనంలో కూడా రుజువైంది. ఉదయం త్వరగా లేచే పిల్లలు ఎక్కువ మంది ఆరోగ్యంగా, పాజిటివ్ దృక్పథంతో ఉంటారని తేలింది. -
టంబుల్స్ ట్రబుల్స్ పరార్
ఈ బుజ్జి కుక్కపిల్లను చూశారా.. ఎంచక్కా చక్రాలు కట్టుకుని తిరుగుతోందో.. పుట్టుకతోనే కాళ్లు కోల్పోయిన ఈ కుక్క పిల్ల పేరు టంబుల్స్. రెండు నెలల వయసున్న ఈ టంబుల్స్ను అమెరికాలోని ఒహాయోకు చెందిన కారెన్, పిచర్ జంట పెంచుకోవాలనుకుంది. అయితే దీనికి కాళ్లు లేకపోవడంతో తల్లడిల్లిన ఆ జంట ఏదైనా చేయాలనుకుంది. వెంటనే బుల్లి చక్రాల కుర్చీ డిజైన్ చేశారు. ఆ తర్వాత ఒహాయో యూనివర్సిటీలో ఉన్న ఇన్నోవేషన్ సెంటర్లో త్రీడీ ప్రింటర్ ద్వారా చక్రాలు తయారు చేయించారు. త్రీడీ ప్రింటింగ్ ద్వారా దీన్ని తయారు చేసేందుకు దాదాపు 14 గంటలు పట్టిందట.