ప్రతీకాత్మక చిత్రం
ఒకసారి వెంటిలేటర్‌పైకి వెళ్తే రోగి తిరిగి కోలుకోవడం కష్టమనే అపోహ చాలామంది రోగుల్లో, వారి రోగి బంధువుల్లో ఉంటుంది. సాధారణంగా రోగులను డాక్టర్లు.. సాధారణ పరిస్థితులోనే మొదట ట్రీట్‌మెంట్ అందిస్తారు. అయితే ఒక్కొసారి వారి శరీరం, మాములు స్థితికి సహకరించకపోతే ఆసమయంలోనే వారిని వెంటిలేటర్‌పైన ఉంచి వైద్యం చేస్తారు..ఒకసారి రోగిని వెంటిలేటర్‌పై పెట్టాక... ఏ పరిస్థితి కారణంగా రోగిని వెంటిలేటర్‌పై పెట్టారో, అది మెరుగయ్యే వరకు వెంటిలేటర్‌పైనే ఉంచాల్సి వస్తుంది. ఇక రోగి కోలుకోవడం అన్నది, అతడికి ఉన్న జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ పై ఉంచుతారు.
కొన్ని రోజుల గడిచిన తర్వాత వాళ్ళు సాధారణ స్థితిలోకి చేరుకుంటారు. కాబట్టి వెంటిలేటర్‌పై పెట్టిన రోగులంతా కోలుకోరని భావించడం సరికాదు. తక్కువ మంది మాత్రమే పరిస్థితి విషమించి, ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తున్నారు. కాబట్టి వెంటిలేటర్ అనగానే ఆందోళన అక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment