
ఆడపడుచుకు అనుకోని ఆపద
♦ అరుదైన వ్యాధికి గురైన మమత
♦ చికిత్సకు రూ. 25 లక్షలు అవసరం
♦ దాతల కోసం ఎదురుచూపులు
మోత్కూరు : నిరుపేద ఆడపడుచుకు పెద్ద కష్టం వచ్చింది. పండంటి బిడ్డను కని ఆనందంగా జీవి తం గడపాలనుకున్న ఆ మహిళకు అనుకోని ఆపద వచ్చింది. అరుదైన వ్యాధి బారినపడింది. మోత్కూరు మండలం మానాయికుంటకు చెందిన కొమ్ము వెంకటయ్య-పద్మ దంపతుల కూతురు మమతకు ఏడాది క్రితం తిరుమలగిరికి చెందిన వీరయ్యతో వివాహమైంది. 3 నెలల క్రితం మమత గర్భవతిగా ఉన్న సమయంలో జ్వరం, ఫిట్స్ రావడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి, అక్కడి నుంచి హైదరాబాద్ కొత్తపేటలోని ఓమ్నీ ఆస్పత్రిలో చేర్పించారు.
అబార్షన్ చేసి 3 నెలలుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. యాంటీఎన్‌ఎండీ యాంటీబాడీ ఎన్‌సెఫలిటీస్ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్సకు 25 లక్షలు అవసరమని చెప్పారు. దేశంలో ఈ వ్యాధి సోకినవారు కేవలం 15 మంది ఉన్నట్లు డాక్టర్లు సందీప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి వివరించారు. అత్తింటివారు పట్టించుకోవడంలేదని, దాతలు ఆపన్నహస్తం అందించాలని తండ్రి వేడుకుంటున్నాడు.
దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 9948050134, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అకౌంట్ నెంబర్ 62406934756