
స్వైన్ సైరన్
హైదరాబాద్‌లో ముగ్గురి మృతి
అప్రమత్తమైన నగర వైద్యులు
వ్యాధి లక్షణాలు కనిపిస్తే సంప్రదించాలని సూచన
మందుల కొనుగోలుకు సిద్ధం
లబ్బీపేట : ఐదేళ్ల కిందట గడగడలాడించిన స్వైన్‌ఫ్లూ మళ్లీ తెరపైకి వచ్చింది. భయూనకమైన ఈ వ్యాధి సోకి హైదరాబాద్‌లో ముగ్గురు మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న నగర వైద్యులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యూరు. చలికాలం కావడం, నిత్యం వేలాదిమంది హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణిస్తుండటంతో నగరానికి కూడా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉందని చెబుతున్నారు. స్వైన్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని నగరవాసులకు సూచిస్తున్నారు. చలికాలం కావడం, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో హెచ్1 ఎన్1 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ వ్యాధికి సంబంధించి మందులు అవసరం లేదనుకున్నా.. ఇప్పుడు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఇండెంట్ సిద్ధం చేస్తున్నారు.
స్వైన్‌ఫ్లూ లక్షణాలివీ..
స్వైన్‌ఫ్లూ సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు, తలనొప్పులతో పాటు డయేరియూ, వాంతుల లక్షణాలు కనిపిస్తారుు. ఈ వ్యాధి సోకిన వారిని గుర్తించి తొలిదశలో చికిత్స అందించకపోతే శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి స్థితిలో వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి ఉంటుంది. వ్యాధి లక్షణాలను తొలిదశలో గుర్తించడం ఎంతో ముఖ్యం.
ఆందోళనలో వైద్య సిబ్బంది
స్వైన్‌ఫ్లూ సోకకుండా ఇన్‌ఫ్లూయెంజా వ్యాక్సిన్ ఉన్నా ధర ఎక్కువ కావడంతో అందరికీ అందుబాటులోకి రాలేదు. మూడేళ్ల కిందట ఈ వ్యాక్సిన్‌ను ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం ద్వారానే వేయించారు. రెండు డోసులుగా ఈ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. అరుుతే, ఆ తరువాత వ్యాధి ఆనవాళ్లు కనిపించకపోవడంతో దాని గురించి అంతా మరిచిపోయూరు. తాజాగా మళ్లీ స్వైన్ సైరన్ మోగడంతో ప్రజలతో పాటు వైద్య సిబ్బందీ అప్రమత్తమవుతున్నారు. జ్వరం, తల నొప్పితో వచ్చే వారిలో ఎవరికైనా స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉంటే తమ పరిస్థితి ఏమిటని వైద్యులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి వైద్య సిబ్బందికి స్వైన్‌ఫ్లూ సోకకుండా వ్యాక్సిన్ వేయడంతో పాటు ప్రజలకు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.
మందులకు ఇండెంట్ పెట్టాం..
హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవడంతో పల్మనాలజీ విభాగంలోని స్వైన్‌ఫ్లూ వార్డును సిద్ధం చేస్తున్నాం. ఆ వ్యాధికి సంబంధించిన మందులు కొనుగోలు చేసేందుకు ఇండెంట్ పెట్టాం. ప్రసుత్తం స్వైన్‌ఫ్లూ వార్డులో ఉన్న వెంటిలేటర్ రిపేరుకు గురవడంతో దానిని తొలగించి మరో వెంటిలేటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించాం. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
- డాక్టర్ జి.రవికుమార్