కర్నూలు అబ్బాయి జపాన్ అమ్మాయికి పెళ్లి
కర్నూలు (టౌన్): కర్నూలు అబ్బాయికి జపాన్ అమ్మాయికి ప్రేమ చిగురించింది. ఇరువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లితో సుఖాంతమైంది. కర్నూలు నగర శివారులోని లక్ష్మీపురంలో ఎతిక్స్ హోమ్స్‌లో కోరకోల కిషోర్‌కుమార్, కడపటింటి ప్రేమమ్మ దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారుడు కొరకోల కీర్తి కుమార్ ముంబై ఐఐటీలో చదువుకున్నాడు. మూడేళ్ల క్రితం జపాన్‌లో అమెజాన్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చింది.
అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇతనికి అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న టోక్యో పట్టణానికి చెందిన మట్ సుమోటో రియోకో, మట్ సుమోటో తఢాక దంపతుల కూతురు మట్ సుమోంటో రింకతో పరిచయం ఏర్పడింది. మూడున్నరేళ్ల వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. రింక అబ్బాయిని తన తండ్రికి పరిచయం చేసింది.ఇరు కుటుంబాలు అంగీకరించడంతో శనివారం కర్నూలులోని సీఎస్‌ఐ క్రైస్ట్ చర్చిలో పెళ్లి తంతు నిర్వహించారు.
చదవండి: మాధవీలతపై వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment