Video camera
-
13 మందిపై అత్యాచారం, వీడియో రికార్డింగ్.. బాలేశ్ ధన్కర్ అకృత్యాలు
సిడ్నీ: ఉద్యోగాల పేరుతో ఇంటర్వ్యూలకు పిలిచి, మత్తు కలిపిన డ్రింక్స్ తాగించి వారిపై అత్యాచారానికి పాల్పడేవాడు.. ఆ దురాగతాలను వీడియో రికార్డింగ్ చేసేవాడు. కొరియా మహిళలంటే ఇతడికి పిచ్చి. బాధితుల్లో వీరే ఎక్కువమంది. వీరి పేర్లు, వివరాలను దాచుకున్నాడు. అతడి గదిలో బెడ్ పక్కనే అలారం క్లాక్‌లోని సీక్రెట్ కెమెరా ద్వారా అన్నీ రికార్డయ్యేవి...ఇవన్నీ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన భారత సంతతి వ్యక్తి బాలేశ్ ధన్కర్ అకృత్యాలు. 2018 జనవరి– అక్టోబర్కాలంలో ఇతడు 13 మంది ఇతడు మహిళలను రేప్ చేశాడు. 2018 అక్టోబర్‌లో పోలీసులు ఇతడి సొంత ఫ్లాట్‌తోపాటు ఓ హోటల్ గదిలో సోదాలు జరపగా మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ బాటిళ్లు, రేప్ దృశ్యాలు, మహిళలతో ఏకాంతంగా ఉండగా తీసిన మొత్తం 47 వీడియోలతో హార్డ్‌డ్రైవ్ దొరికింది. బాలేశ్ నేరాలపై న్యూసౌత్ వేల్స్ జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. కొన్ని వీడియోల్లోని అసహ్యకర దృశ్యాలను జడ్జీలు కూడా చూడలేకపోయారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది. -
తమ్ముడూ నిన్నే..
తమ్ముడూ నిన్నే.ఎవరూ చూడటం లేదనుకుంటున్నావేమో.ఆమెకు తెలియకుండా ఫోన్లోబంధించాలనుకుంటున్నావేమో.చెత్త ఆలోచనలకు వాడాలనుకుంటున్నావేమో.మానుకో. మారు.నీ పనులకు శిక్షలు ఉన్నాయి.నీ చేష్టలకు బేడీలు పడతాయి.స్త్రీలు అప్రమత్తమయ్యారు.వారు నిన్ను వదలరు. తాట తీస్తారు. మెట్రోలో ప్రయాణిస్తున్నారు ముగ్గురు స్నేహితులు. ఆఫీస్ వేళ కావడం వల్ల రద్దీగా ఉంది ట్రైన్. ఈ ముగ్గురికీ సీట్ దొరకలేదు. కూర్చున్న లేడీస్‌కి దగ్గరగా నిలబడి ఉన్నారు. ఇంతలో మ«ధ్యలో నిలబడ్డవాడు మెల్లగా ఫోన్లోని కెమెరా ఆన్ చేశాడు. ఈ అమ్మాయిలను ఫోకస్ చేశాడు. కూర్చుని ఉన్న అమ్మాయిల ఎదను చేయి పైకెత్తి కేప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కూర్చున్న అమ్మాయిలు వీళ్లను గమనించట్లేదు. కాని ఆ ముగ్గురి పక్కన నిలబడ్డ ఒక అమ్మాయి పసిగట్టి.. అతని చేతిలోంచి ఫోన్ లాగేసి ‘మిమ్మల్ని వీడు వీడియో తీస్తున్నాడు’ అంటూ ఆ ఫోన్‌ను ఆ అమ్మాయిల చేతికిచ్చింది. వాళ్లు అలెర్ట్ అయ్యేలోపు ఈ ముగ్గురూ ఆ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. గోలగోల అయ్యింది. అందరూ కలిసి పక్కస్టేషన్లో ఆ ముగ్గురిని పోలీసులకు అప్పజెప్పారు. బస్టాప్‌లో ఆ కుర్రాడు. ఈ పని కోసమే వచ్చినట్టున్నాడు. బస్ కోసం వెయిట్ చేస్తున్న ఒకావిడను వెనక నుంచి వీడియో తీయడం మొదలుపెట్టాడు. దూరం నుంచి చూసేవారికి అతను మామూలుగా ఫోన్ పట్టుకున్నట్టు ఉంటుంది. కాని అందులో ఆమె వెనుకభాగం రికార్డ్ అవుతోంది. ఇంతలో ఆమె వెనక్కి తిరిగింది. అతడు కంగారు పడ్డాడు. అనుమానం కలిగించింది. వెంటనే వెళ్లి ఫోన్ లాక్కుంటే కెమెరా ఆన్‌లో ఉంది. మైట్రో ట్రైన్ వెళుతూ ఉంది. ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఎదురుగా కాలేజీ అమ్మాయి నిలబడి ఉంది. అతను ఫోన్లో ఒక వీడియో ఆన్ చేసి ఎదురుగా నిలబడి ఉన్న అమ్మాయికి కనిపించేలా పెడ్తున్నాడు. ముందు ఆ అమ్మాయి పట్టించుకోలేదు. ఎంతసేపైనా ఆ వీడియోను ఆఫ్ చేయకపోయేసరికి అతనికి తెలియకుండా ఏమన్నా ఆన్ అయిందేమో అనుకొని అతనికి చెప్పబోతూ ఆ వీడియోను చూసి షాక్ అయింది. అది పోర్న్ వీడియో. కావాలనే.. తనకు కనిపించాలనే అతను అలా పెట్టాడు అని అర్థమైంది ఆ అమ్మాయికి. ఇవన్నీ నిజాలే. జరిగినవే.. జరుగుతున్నవే. అయితే ఇలాంటి చర్యలకు పాల్పపడుతున్న వాళ్లకు ఇవీ నేరాలే అది వీటికి శిక్షలున్నాయని తెలియదు. మనల్ని ఎవరు పట్టుకుంటారు అన్న ధీమాతో ప్రవర్తిస్తుంటారు. కాని వీళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని నడుచుకునేలా చేసే చట్టాలున్నాయి. ఈ నేరాలు ఏ చట్టం కిందకు వస్తాయి? ‘మహిళ అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఆమెను, ఆమె కదలికలను, శరీర భాగాలను చిత్రీకరిస్తే నిర్భయ చట్టంలోని 354 (డి) కింద నేరం. మొదటిసారి చేస్తే మూడేళ్ల జైలుశిక్ష.. పదేపదే చేస్తే అయిదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఐపీసీ 509 ప్రకారం ఇది మహిళ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే చర్య. కాబట్టి ఈ సెక్షన్ కింద కేసు నేరస్తుడికి మూడు నుంచి అయిదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటివాటికి పాల్పడినందుకు, పోర్న్‌వీడియోలు చూపించినందుకు ఐపీసీ 294 (అబ్సీన్ యాక్ట్) కింద మూడు నెలల నుంచి ఆరునెలల వరకు జైలు శిక్ష ఉంటుంది. వీన్నిటితోపాటు ఐటీ యాక్ట్ ఉండనే ఉంది. 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం మహిళకు సంబంధించిన దృశ్యాలను కామాన్ని ప్రేరేపించేలా చిత్రీకరించి వాటిని ఇంటర్నెట్లో ప్రచురించిన, ప్రసారం చేసినా అయిదేళ్ల జైలు శిక్షతోపాటు లక్షరూపాయల జరిమానా ఉంటుంది. అమ్మాయిలే కాదు.. అబ్బాయిల తల్లిదండ్రులూ ఇవి తెలుసుకోవాలి. తమ పిల్లల కదలికల మీద నిఘా వేయాలి’ అని వివరిస్తున్నారు అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్ పార్వతి. కంప్లయింట్ ఎక్కడ ఇవ్వాలి? అయితే ఈ శిక్షలన్నీ పడాలంటే ముందు ఆ నేరం నమోదు కావాలి. అంటే నేరస్తుడిని పట్టుకోవాలి. ‘బహిరంగ ప్రదేశాల్లో ఇలా తమను ఎవరైనా వెంటాడుతున్నారు.. తమ మీద ఫోన్ ఫోకస్ అయి ఉంది అన్న అనుమానం రాగానే రియాక్ట్ కావాలి. వెంటనే అవతలి వ్యక్తి చేతుల్లోంచి ఫోన్ లాక్కోవాలి. గట్టిగా అరిచి చుట్టూ ఉన్నవాళ్ల దృష్టిని తన వైపు తిప్పి ఆ వ్యక్తి పారిపోకుండా చేయాలి. 100కి డయల్ చేస్తే షీటీమ్స్‌కి కనెక్ట్ అయ్యి దగ్గర్లో ఉన్న షీ టీమ్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడు తెలంగాణ పోలీస్ వాళ్ల ‘హాక్ – ఐ’ యాప్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘దిశ’ యాప్‌లూ ఉన్నాయి అందుబాటులో. హాక్– ఐలోని ఎస్ఓఎస్ నొక్కితే చాలు మీరు రక్షణ వలయంలోకి వెళ్లినట్టే. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ప్రమాదంలో ఉన్నామనే అనుమానం కలిగితే చాలు ఆ యాప్ ఓపెన్ చేసి ఫోన్ కదిలిస్తే సమీప పోలీస్ సిబ్బందికి సంకేతాలు వెళ్లి నేరస్తుల వేట మొదలవుతుంది. ఇవన్నీటితోపాటు మీకు దగ్గర్లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లోనైనా జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేయవచ్చు. మిమ్మల్ని వీడియో తీసిన కాపీ అతని ఫోన్లో లేకపోయినా... దాని కాపీ ఇంకా ఎక్కడ దొరికినా.. కూపీలాగి నేరస్తుడిని కటకటాల్లో తోసే వీలుంటుంది’ అని చెప్తారు తెలంగాణలోని విమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఇన్స్పెక్టర్ కిరణ్. ఇంత మందిలో నన్నెవరు చూడొచ్చారులే అనే జులాయీల ధిలాసాకు వణుకు పుట్టించే టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. ట్రాక్ యాప్‌ల నుంచి సర్వైలెన్స్ ఐ వరకు పోలీస్ రిపోర్ట్ నుంచి కోర్ట్ కొరడా దాకా బోలెడు. అందుకే మహిళల పట్ల మర్యాద పాటించడం ఒక్కటే రక్షణ కవచం. అది నేర్చుకుంటే ఇవన్నీ దూరం. ఈ పాఠం అందరికీ! – సరస్వతి రమ కొత్త యాప్‌లున్నాయి.. జాగ్రత్త కొత్త కొత్త యాప్‌లు వస్తున్నాయి వాటి గురించి అవగాహన ఉండాలి. మనకు తెలియకుండానే మనల్ని వీడియో తీస్తుంటారు. అనుమానం వచ్చి పట్టుకుంటే ఆ ఫోన్లో ఏమీ కనిపించదు. అలాంటి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటారు. అందుకే ఫోన్ లాక్కోగానే గ్యాలరీలోకి వెళ్లి చూసే బదులు కెమెరా యాక్టివ్‌లో ఉందా అనేది చెక్ చేయాలి. కెమెరా యాక్టివ్‌లో ఉంటే కచ్చితంగా మిమ్మల్ని ట్రేస్ చేస్తున్నట్లే లెక్క. కొన్ని ఫోన్లలో టచ్ చేయంగానే కెమెరా ఆఫ్ అయిపోయేలా సెట్టింగ్స్ ఉంటాయి. అప్పుడు ఓపెన్‌లో ఉన్న ట్యాబ్స్ అన్నీ చెక్ చేయాలి. గ్యాలరీలో ఫీడ్ ఏమీ దొరక్కపోయినా తర్వాత ఎక్కడోక్కడ కాపీ చేస్తారు. అప్పుడు దాంతో ఇమేజ్ అనాలిసిస్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫోన్ లాక్కోగానే కెమెరా పొజిషన్‌ను చెక్ చేయడం మాత్రం మరవద్దు. ఒకవేళ ఎక్కడా ఏమీ దొరక్కపోయినా సీసీ కెమెరా ఫుటేజ్‌తో నేరస్తులు ఏం చేశారో చూడొచ్చు. ఫేస్ రికగ్నినిషన్ కెమెరాలను అమర్చీ ఇలాంటి వాళ్ల ఆగడాలను అరికట్టొచ్చు.– సందీప్ ముదాల్కర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ అండ్ ట్రైనర్, ఇ. పార్వతిఅడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సెలర్ -
విద్యార్ధులపై విరిగిన లాఠీలు
-
ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ కోసం నయీం చిత్రీకరణ
సాక్షి, సిటీబ్యూరో: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు సిటీకి వచ్చాడు... మారుపేరుతో పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నించాడు...ఓ వీడియో కెమెరాతో నగరం మొత్తం తిరుగుతూ కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు...ఆ సమయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను కలిగి ఉన్నాడు...ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ సమీర్ అలియాస్ నయ్యూపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందంలో (సిట్) నమోదైన కేసు పూర్వాపరాలివి. ఇతడిని పీటీ వారెంట్‌పై గురువారం రాత్రి ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి తీసుకువచ్చిన సిట్ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. షేక్ సోహైల్ పేరుతో పాస్‌పోర్ట్‌కు... మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన నయీం ఇంజినీర్ అయినప్పటికీ ఎల్ఈటీకి సానుభూతిపరుడిగా మారాడు. పాకిస్థాన్‌లో ఉన్న ఆ సంస్థకు చెందిన వారి నుంచివచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నాడు. అందులో భాగంగానే ఇతడు 2007 ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పటికి సిటీలోనే ఉన్న ఇతడి సన్నిహితుడు షోయబ్ జాగీర్దార్ ఇతడిని రిసీవ్ చేసుకున్నాడు. హష్మత్పేటలోని తన బంధువు ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. స్టార్ లైన్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన ట్రావెల్ ఏజెంట్ నగేష్ సహకారంతో సికింద్రాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి దొంగ పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నించాడు. షేక్ సోహైల్ పేరుతో రూపొందించిన పత్రాలపై సికింద్రాబాద్ వచ్చిన సమీర్ సంతకాలు చేశాడు. అక్కడ నుంచి తిరిగి హష్మత్పేటలోని ఇంటికి వెళ్ళకుండా నగరంలోని కీలక ప్రాంతాలను చుట్టి వచ్చాడు. ఆ సమయంలో తనతో పాటు ఓ వీడియో కెమెరా తీసుకువెళ్లిన నయీం అనేక కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు. ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను తన వెంటే ఉంచుకున్నాడు. ఎల్ఈటీకి అందించడానికే సిటీలోని కీలక ప్రాంతాలు వీడియో తీశాడని, ‘ఆ బ్యాగ్’లో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. కొన్నాళ్ల తర్వాత వెలుగులోకి... ‘సిటీ టూర్’ ముగించుకున్న నయీం మళ్ళీ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. కొన్ని రోజులకు మళ్లీ ఎల్ఈటీ నుంచి ఇతడికి మరో సమాచారం అందింది. దాని ప్రకారం ఇతగాడు బంగ్లాదేశ్ వెళ్లి కొందరిని కలవాలి. అక్కడ నుంచి ముగ్గురు సుశిక్షుతులైన ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి జమ్మూ కాశ్మీర్‌కు చేర్చాలి. కొన్ని నెలల పాటు పాక్‌లో శిక్షణ పొందిన ఈ ఉగ్రవాదుల్లో అక్కడి కరాచీ, హరిపూర్లకు చెందిన మహ్మద్ యూనస్, అబ్దుల్లాలతో పాటు కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన ముజఫర్ అహ్మద్ రాథోడ్ ఉన్నారు. కాశ్మీర్లో భారీ ఆపరేషన్‌కు ప్లాన్ చేసిన ఎల్ఈటీ దాని కోసమే వారిని పంపింది. 2007 ఏప్రిల్ 4న పశ్చిమ బెంగాల్లో ఉన్న 24 పరగణాల జిల్లాలోని పెట్రాపోల్ నుంచి ఈ నలుగురూ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పట్టుకోవడంతో వీరిపై బన్గావ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఎంతకీ నోరు విప్పని ఈ ఉగ్రవాదులకు పోలీసులు పాలిగ్రఫీ, నార్కో అనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి నిజ నిర్థారణ పరీక్షలు చేసింది. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ కుట్రతో పాటు ‘సిటీ టూర్’ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్ కుట్ర కేసు నమోదు చేసింది. అప్పట్లోనే సిటీకి తీసుకువచ్చి విచారించడంతో పాటు అభియోగపత్రాలు దాఖలు చేసింది. ఆ ముగ్గురికీ ఉరి శిక్ష విధింపు... పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు ఈ నలుగురిపై 2007 జూన్ 29న బన్గావ్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసుల విచారణ జరుగుతుండగానే కోల్‌కతా పోలీసులు 2014 సెప్టెంబర్ 24న సమీర్‌లో మరో కేసుకు సంబంధించి ముంబై కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తిరిగి హౌరా–ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతాకు తీసుకువెళ్తుండగా... ఖర్సియా–శక్తి రైల్వేస్టేషన్ల మ«ధ్య తప్పించుకుని పారిపోయాడు. దీంతో మిగిలిన ముగ్గురిపై విచారణ పూర్తి చేసిన బన్గావ్ కోర్టు గత ఏడాది జనవరిలో ఉరి శిక్ష విధించింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయీంను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు 2017 నవంబర్ 29న లక్నోలో పట్టుకున్నారు. ఆపై విచారణ నిమిత్తం నయీంను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. నగరంలోని సిట్‌లో నమోదైన కుట్ర కేసులో ట్రయల్ నిర్వహించాల్సి ఉండటంతో సిట్ నయీంను సిటీకి తీసుకువచ్చింది. -
చెప్పుల్లో కెమెరా పెట్టి...
-
ఫంక్షన్‌కు వెళ్లి కెమెరా ఎక్కడ పెట్టాడో తెలిస్తే షాకే..
సాక్షి, తిరువనంతపురం : లైంగిక వేధింపులకు పాల్పడేవాళ్లు కూడా తెలివి మీరారు. ప్రత్యక్షంగా వేధింపులకు అవకాశం దొరకడం లేదని పరోక్ష వేధింపులకు ప్లాన్ చేసుకుంటున్నారు. టెక్నాలజీ సాయంతో వారు మహిళలను టార్గెట్ చేస్తున్నారు. సీక్రెట్ కెమెరాలను ఆశ్రయిస్తూ వాటితో మహిళలను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు. కేరళలో ఓ వ్యక్తి మహిళల స్కర్ట్స్ వీడియోలను చిత్రీకరించాలనే దుర్బుద్ధితో ఏకంగా తన చెప్పులకు రంధ్రాలు చేసి అందులో మినీ వీడియో కెమెరా పెట్టి రికార్డింగ్ చేస్తూ పోలీసుల చేతికి చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. బైజు అనే వ్యక్తి త్రిశూర్ జిల్లాలోని కాలోల్సావం అనే ప్రాంతంలో ఓ వేడుకకు హాజరయ్యాడు. ఎవరికీ అనుమానం రాకుండా తన చెప్పులకు రంధ్రం చేసి అందులో కెమెరా పెట్టి ఆ వేడుక మొత్తం కలియ తిరగడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా స్కర్ట్స్ వేసుకున్నవారి వద్దకు వెళడం అక్కడ కొద్ది సేపు ఉండటం తర్వాత మరొకరి దగ్గరకు వెళుతుండటం చేశాడు. దాంతోపాటు ఎక్కువమంది ఉన్నచోటుకు వెళ్లి వారి మధ్యలో ఎవరికీ అనుమానం రాకుండా కెమెరా ఉన్న చెప్పును పెట్టడం దూరంగా వెళ్లి గమనించడం చేశాడు. అయితే, అదే వేడుకలో ప్రత్యేక నిఘాతో ఉన్న పోలీసులు అతడిని గమనించి అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతడి చెప్పులో కెమెరా ఉన్నట్లు తెలిసింది. దాంతో అతడిని అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఇలాంటి వ్యక్తిని, చర్యను తాము ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. -
నగరంలో పటిష్టమైన నిఘా కెమెరాలు
► ఒక్కోటి 7 చదరపు కిమీ పరిధిలో నిఘాకు అనువు ► 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కొత్వాల్ నిర్ణయం ► ప్రధాని రాక నేపథ్యంలో ప్రయోగాత్మకంగా 3 ఏర్పాటు హైదరాబాద్: దాదాపు వంద మంది పోలీసుల కాసే కాపలాను ఒక్క కెమెరా కాస్తుంది. తన చుట్టూ ఏడు చదరపు కిమీ పరిధిలో ఏకకాలంలో కన్నేసి ఉంచుతుంది... రెండు చదరపు కిలోమీటర్లలో ఉన్న వ్యక్తి ముఖాన్ని సైతం స్పష్టంగా చూపిస్తుంది... ఇలాంటి శక్తిమంతమైన పీటీజెడ్ కెమెరాలను నగర పోలీసు విభాగం సమీకరించుకుంటోంది. ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరుగనున్న ప్రధాని నరేంద్ర మోడీ సభ నేపథ్యంలో మూడింటిని తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. రియల్ టైమ్ సమాచారం సేకరణకు... అత్యంత ప్రముఖుల పర్యటనలు, గణేష్ నిమజ్జన ఊరేగింపు, భారీ స్థాయిలో జరిగే సభలు, సమావేశాల సందర్భంలో బందోబస్తు, భద్రతా విధులు పోలీసులకు పెద్ద సవాల్ లాంటిదే. ఆయా ప్రాంతాలతో పాటు నగర వ్యాప్తంగానూ ఏం జరుగుతోందో ఎప్పకప్పుడు తెలుసుకుంటేనే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సిటీలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో, ఏకకాలంలో నిఘా ఉంచడానికి ఉపకరించవు. ఈ నేపథ్యంలో కీలక ఘట్టాల్లో ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) సమాచారం సేకరించడానికి అత్యంత శక్తిమంతమైన వీడియో కెమెరాలను వినియోగించాలని నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. 12 ప్రాంతాల్లో ఏర్పాటుకు నిర్ణయం... మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ తరహా కెమెరాల్లో ఆక్టోవిజన్ కంపెనీకి చెందిన ‘30 ఎక్స్ పీటీజెడ్ డోమ్’ కెమెరాలు సిటీలో వినియోగించడానికి అన్ని కోణాల్లోనూ ఉపయుక్తమని నిర్ణయించారు. వైర్లెస్ పరిజ్ఞానంతో పని చేసే ఈ కెమెరాలు గరిష్టంగా ఏడు చదరపు కిమీ పరిధిలో కన్నేసి ఉంచడానికి ఉపకరిస్తాయి. ఇలాంటి కెమెరాలు 12 ఖరీదు చేయడంతో పాటు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎత్తైనన భవనాలను ఎంపిక చేసుకుని, వాటిపై వీటిని బిగిస్తారు. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ అక్కడి దశ్యాలను చూపించడం వీటి ప్రత్యేకత. ఈ కెమెరాలను వైర్లెస్ పరిజ్ఞానంతోనే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (సీసీసీ) అనుసంధానిస్తారు. అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు ఈ పరిధిలో ఏం జరుగుతోందనేది తెరపై చూస్తూ తెలుసుకునే అవకాశం ఉంది. ప్రయోగాత్మంకగా మూడు ఏర్పాటు... ఈ కెమెరాల పనితీరును అధ్యయనం చేయడానికి ప్రయోగాత్మకంగా మూడింటిని ఖరీదు చేశారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరుగనున్న ప్రధాని మోడీ సభ నేపథ్యంలో వినియోగిస్తున్నారు. స్టేడియం చుట్టూ ఉన్న బాబూఖాన్ ఎస్టేట్, కేఎల్కే ఎస్టేట్, డెక్కన్ టవర్స్‌పై వీటిని ఏర్పాటు చేశారు. పవర్‌కట్ వంటి సమస్యలు రాకుండా జనరేటర్ సౌకర్యం ఉన్న లిఫ్ట్ రూమ్స్ నుంచి పవర్ సప్లై తీసుకున్నారు. బాబూఖాన్ ఎస్టేట్ పైన ఉన్న కెమెరాతో అటు చార్మినార్, ఇటు బోయిన్పల్లి ప్రాంతాలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు మిగిలిన రెండింటితోనూ ఎల్టీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు స్టేడియం లోపలా, వేదికనూ స్పష్టంగా చూసే అవకాశం ఏర్పడింది. ఎల్టీ స్టేడియం, చుట్టూ ఉన్న మార్గాలు, పార్కింగ్.. ఇలా ప్రతి ప్రదేశంలోని అణువణువూ స్పష్టంగా కనిపిస్తోంది. వీటిలోని అత్యాధునిక అంశాలు ఎన్నో... ఇంటర్నెట్ ప్రొటోకాల్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ కెమెరాలను ఎలాంటి వైర్లు లేకుండానే సీసీసీతో అనుసంధానించవచ్చు. బహిరంగ, ఎత్తైన ప్రదేశాల్లో ఉండే కెమెరాల నిర్వహణ పెద్ద సవాల్ లాంటిది. నిత్యం దుమ్ముధూళితో పాటు వర్షం కురిసినప్పుడు వాననీటి చుక్కలు కెమెరా గ్లాస్‌పై పడి ఇబ్బందులు కలిగిస్తాయి. అలాగని ప్రతిసారీ వాటి వద్దకు వెళ్ళి శుభ్రం చేయడం కష్టసాధ్యం. ఈ నేపథ్యంలో ఈ కెమెరాలను వైబర్ సదుపాయం కూడా ఉంది. సీసీసీలోని సిబ్బంది ఓ కమాండ్ ఇవ్వడం ద్వారా కెమెరా గ్లాస్‌పై ఉండే వైబర్ శుభ్రం చేస్తుంది. సిబ్బందితో పని లేకుండా ఉండేలా సెన్సర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. గణేష్ నిమజ్జనం నాటికి 12 కెమెరాలను వినియోగంలోకి తీసుకురావడానికి నగర పోలీసు విభాగం కసరత్తు చేస్తోంది. -
ఇక ‘వీడియో’ పెట్రోలింగ్
- తస్మాత్ జాగ్రత్త! నిఘా నేరుగా మీ వద్దకే.. - 24 గంటల పాటు పహారా - కరీంనగర్లో ప్రారంభించిన ఎస్పీ - రెండో దశలో గోదావరిఖనిలో.. కరీంనగర్ క్రైం: ఆరుబయట మద్యం తాగడం, ఈవ్‌టీజింగ్, ఆందోళనలు, అల్లరిమూకల వేధింపులు, ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు... ఇవే కాదు ఎక్కడేం జరిగినా ఇక పోలీసుల కెమెరాలో నిక్షిప్తం కానున్నారుు. వీడియో కెమెరాతో కూడిన అత్యాధునికమైన పెట్రోలింగ్ వాహనాన్ని సోమవారం ఎస్పీ శివకుమార్ కరీంనగర్లో ప్రారంభించారు. పెట్రోలింగ్ వాహనంలో ఏర్పాటు చేసిన వీడియో కెమెరా అన్ని సంఘటనలను రికార్డు చేసి కంట్రోల్ రూంకు చేరవేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర రాజధానిలో విజయవంతమైన ఈ విధానాన్ని మొదటిసారిగా జిల్లా కేంద్రంలో ప్రవేశపెట్టారు. రెండో దశలో ఇలాంటి పెట్రోలింగ్ వాహనాన్ని గోదావరిఖనిలో ప్రారంభిస్తామని ఎస్పీ తెలిపారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే డయల్ 100కు గాని, వాట్స్ యూప్ నంబర్ 7093101101కు సమాచారం అందించాలని సూచించారు. కాగా.. ఈ పెట్రోలింగ్ వాహనానికి నిత్యం ఒక ఎస్సై ఇన్చార్జిగా వ్యహరిస్తారు. ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి షిప్ట్ పద్ధతిలో 24 గంటల పాటు పెట్రోలింగ్ చేస్తుంది. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటే సంఘటన స్థలానికి చేరుకుని వీడియో రికార్డు చేయడంతో పాటు ఫొటోలు తీస్తుంది. అక్కడ సంఘటనను నియంత్రించడానికి పోలీసులు చర్యలు చేపడతారు. నగర శివారుల్లో మద్యం సేవిస్తున్న వారి ఫొటోలు, వీడియోలు రికార్డు చేసి అక్కడ్కికడే జరిమానా విధించడం లేదా వారిని కోర్టులో ప్రవేశపెడుతారు. దీనికి సాక్ష్యంగా వాహనంలో రికార్డు అయిన వీడియోను కోర్టుకు సమర్పిస్తారు. ఈ వీడియోలో నిక్షిప్తమైన అన్ని కేసుల్లోనూ కోర్టుకు ఆధారాలను సమర్పిస్తారు. ఇప్పటికే పోలీసులకు అందించిన వాహనాలపై ప్రత్యేకమైన లైట్లు, మైక్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, గోదావరిఖని డీఎస్పీలు జె.రామారావు, ఎస్.మల్లారెడ్డి, ఏఆర్ డీఎస్పీ కోటేశ్వర్రావు, కరీంనగర్ వన్, టు, త్రీ రూరల్, ట్రాఫిక్, తిమ్మాపూర్ సీఐలు విజయసారథి, హరిప్రసాద్, సదానందం, నరేందర్, మహేశ్‌గౌడ్, వెంకటరమణ పాల్గొన్నారు.