ఇంకా వెంటిలేటర్ మీదే అంబరీష్ | Ambareesh stable, but still on ventilator | Sakshi
Sakshi News home page

ఇంకా వెంటిలేటర్ మీదే అంబరీష్

Published Mon, Feb 24 2014 4:45 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM

ఇంకా వెంటిలేటర్ మీదే అంబరీష్ - Sakshi

ఇంకా వెంటిలేటర్ మీదే అంబరీష్

కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీష్ పరిస్థితి బాగానే ఉందని, అయితే ఆయన మరో రెండు రోజుల పాటు వెంటిలేటర్ మీదే ఉండాలని ఆయనకు వైద్యం చేస్తున్న ఓ వైద్యుడు తెలిపారు. 61 ఏళ్ల అంబరీష్ను ఈనెల 21న ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ఊపిరి అందని స్థితిలో తీసుకొచ్చారు.

ప్రస్తుతం ఆయనకు యాంటీబయాటిక్స్, నెబులైజర్లు, ఫీడింగ్ ఇస్తున్నామని, నొప్పి తెలియకుండా పూర్తిగా మత్తులోనే ఉంచుతున్నట్లు విక్రమ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ కేఎస్ సతీష్ తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో ఆయనకు ఊపిరి సాధారణంగానే అందుతుందని ఆశిస్తున్నామని, అప్పుడు వెంటిలేటర్ సపోర్ట్ తీసేస్తామని అన్నారు. ఆయన పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని, వెంటిలేటర్ తీసేయాలో వద్దో రేపు ఉదయం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement