'దయచేసి సింగపూర్ రావద్దు' | don't come Singapore, Sumalatha appealed to Ambareesh fans | Sakshi
Sakshi News home page

'దయచేసి సింగపూర్ రావద్దు'

Published Mon, Mar 17 2014 9:05 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 AM

'దయచేసి సింగపూర్ రావద్దు'

'దయచేసి సింగపూర్ రావద్దు'

బెంగళూరు : సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రముఖ నుటుడు అంబరీష్ను పరామర్శించేందుకు వెళుతున్న సన్నిహితులు, అభిమానుల సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో అంబరీష్ను పరామర్శించేందుకు సన్నిహితులెవ్వరూ సింగపూర్ రావద్దని ఆయన సతీమణి సుమలత కోరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వార్డులో అంబరీష్ చికిత్స తీసుకుంటున్నారని, ఇతరులనెవరినీ వార్డులోనికి అనుమతించడం లేదని సుమలత పేర్కొన్నారు.

అందుకే సన్నిహితులెవరూ సింగపూర్కు రావాల్సిన అసవరం లేదని, అంబరీష్ పూర్తిగా కోలుకున్నాక తామే బెంగళూరుకు వస్తామని ఆమె తెలిపారు. శనివారం నటుడు దర్శన్, నిర్మాత సందేశ్ నాగరాజ్లు అంబిని పరామర్శించిన విషయం తెలిసిందే. దీంతో మరికొంతమంది సన్నిహితులు అంబరీష్ను పరామర్శించేందుకు నగరం నుండి బయలుదేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement