వెంటిలేటర్‌పైనే చిన్నారి సంజన | Sanjana still on ventilator | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 7 2016 11:41 AM | Last Updated on Wed, Mar 20 2024 3:29 PM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న చిన్నారి సంజనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నట్లు కామినేని వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, సంజన తల్లి శ్రీదేవి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రమాదం ఏమీ లేదు కానీ, పక్కటెముకలు విరగటంతో ఆమె ఇబ్బంది పడుతోందని వెల్లడించారు. త్వరలోనే ఆమె కోలుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం తల్లీబిడ్డకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయని తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement