
Ariyana on Ventilator : బిగ్‌బాస్ షో అనంతరం అరియానా గ్లోరీ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందన్న సంగతి తెలిసిందే. హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా అరియానా పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. రీసెంట్‌గా ఆర్టీజీవో చేసిన ఇంటర్వ్యూతో అరియానా పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్‌పై ఫోకస్ చేసిన అరియానా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో అభిమానులను షాక్‌కి గురిచేసింది. వెంటిలేటర్‌పై అరియానాను చూసి ఆమె ఫ్యాన్స్‌కి గుండె ఆగినంత పని అయ్యింది. అయితే ఇది రియల్ లైఫ్‌లో జరిగింది కాదు. సినిమా షూటింగ్‌లో భాగంగా అరియానా అలా వెంటిలేటర్‌పై కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా అరియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. మెగాస్టార్ అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా చేస్తున్న సినిమాలో అరియానా ఓ రోల్‌లో కనిపించనున్నట్లు తెలిసిందే. షూట్‌లో భాగంగా వెంటిలేటర్‌పై కనిపించి అరియానా షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment