సాక్షి, కరీంనగర్: బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడు బాస సత్యనారాయణపై అధిష్టానం వేటువేసింది. ఓ మహిళా కార్యకర్తతో రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయనపై ఈ మేరకు చర్య తీసుకున్నారు. సత్యనారాయణ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించారు. బాధ్యత గల పదవిలో ఉండి మహిళా కార్యకర్తతో ఇలా వ్యవహరించడం పార్టీతో పాటు ఆయన వ్యక్తిత్వానికి సరైనది కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నూతన అధ్యక్షుడిగా గంగాడి కృష్ణారెడ్డిని నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. కాగా బాస సత్యనారాయణ ఓ మహిళాతో అసభ్యకర రీతిలో మాట్లాడుతున్న ఓ ఆడియో ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.
కార్యకర్తతో రాసలీలలు.. బీజేపీ అధ్యక్షుడిపై వేటు
Published Fri, Oct 2 2020 2:14 PM | Last Updated on Fri, Oct 2 2020 4:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment