రాసలీలలు.. మహిళ సంచలన వ్యాఖ్యలు | Karimnagar BJP Women Activists Comments On Basa Satyanarayana Accet | Sakshi
Sakshi News home page

భార్యగా స్వీకరించారు.. అందుకే సహజీవనం చేశా

Published Sat, Oct 3 2020 5:32 PM | Last Updated on Sat, Oct 3 2020 8:28 PM

Karimnagar BJP Women Activists Comments On Basa Satyanarayana Accet - Sakshi

సాక్షి, కరీంనగర్‌ : జిల్లాలోని ఓ బీజేపీ మహిళా కార్యకర్త కమలదళంలో కలకలం సృష్టిస్తున్నారు. నిన్నటి వరకు బీజేపీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన బాస సత్యనారాయణ రాసలీలల వీడియో, ఆడియో బయటపెట్టి అడ్డంగా బుక్ చేసిన సదరు మహిళా సంచలన వ్యాఖ్యలతో మరో వీడియో విడుదల చేశారు. బాస సత్యనారాయణ బొట్టు పెట్టి చిన్న భార్యగా స్వీకరించడంతో ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నానని ప్రకటించారు.‌ ప్రస్తుతం బయటికొచ్చిన రాసలీలల వీడియో తనకు తెలియకుండా ఎవరో కావాలని బయటపెట్టారని స్పష్టం చేశారు. 70 ఏళ్ళ ముసలాయనతో ఎలా సహజీవనం చేస్తున్నావని, డబ్బుల కోసమే వ్యభిచారం చేస్తున్నావని పేపర్ల మీద సంతకాలు తీసుకుని, నానా రకాలుగా హింసిస్తున్నారని తెలిపారు. (చదవండి : కార్యకర్తతో రాసలీలలు.. బీజేపీ అధ్యక్షుడిపై వేటు)

తన ఇంట్లో బీజేపీ నాయకురాళ్ళు ఇద్దరు, మరో నాయకుడు అసభ్యకరమైన పని చేశారని చెప్పారు.‌ నా ఇంట్లో ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే కామ్ గా ఊరుకోకుంటే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. తాను ఎవ్వరిని బ్లాక్ మెయిల్ చేయలేదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లానని, ఆయన పట్టించుకోలేదన్నారు. తనకు బీజేపీ నాయకుల నుంచి ప్రాణభయం ఉందని చెప్పారు. ఇప్పటికైనా బండి సంజయ్ న్యాయం చేయాలని  కోరారు.‌  రాజకీయ క్రీడలో తనను ఎందుకు వాడుకుంటున్నారని ఆ మహిళా కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement