టీడీపీ కీలక నేతకు దిమ్మతిరిగే షాక్..
విజయవాడ/భీమవరం: టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సెటైర్లు, పంచ్‌లు చూసి చంద్రబాబు నాయుడు సర్కారు సహించలేకపోతోంది. అందుకే పొలిటికల్ పంచ్ రవికిరణ్, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలోనే టీడీపీ నాయకులు పలువురు నెటిజన్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ నెటిజన్ ను టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ సోదరుడు బోండా ప్రకాశ్ బెదిరిస్తున్నట్లున్నగా ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేస్తా..' అంటూ బెదిరించిన బోండా ప్రకాశ్ కు సదరు నెటిజన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదుకాలేదు. వైఎస్సార్ సీపీ, వైఎస్ జగన్ అభిమానినని గర్వంగా చెప్పుకున్న ఆ యువకుడు టీడీపీ నేతల బెదిరింపులకు ఎలాంటి సమాధానం ఇచ్చాడో వీడియో క్లిక్ చేసి మీరే వినండి..