సాక్షి,రామచంద్రాపురం : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మంత్రి సుభాష్‌కు చంద్రబాబు అక్షింతలు వేసిన ఆడియోను ఆయన వ్యతిరేక వర్గం లీక్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు విషయంలో వెనుకబడిన మంత్రి సుభాష్‌ను తీవ్రంగా హె చ్చరించారు చంద్రబాబు
తొలిసారి ఎమ్మెల్యే, మంత్రైన సుభాష్.. పనితీరు మార్చుకోవాలంటూ చివాట్లు పెట్టారు. ‘పార్టీకి ఉపయోగపడని రాజకీయాలు మీకెందుకయ్యా? ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం చేస్తారయ్యా? ఎవ్రిడే మీకు టెస్టే.. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఏ ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని మీరూ ప్రూవ్ చేసుకోవాలి.
లేదంటే మేం ఆల్టర్నేట్ చూస్తాం’ అని ఫోన్‌లో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్ధంగాక మంత్రి సుభాష్ నీళ్లు నమిలారు. ఆ ఆడియో అటు సోషల్ మీడియాలోనూ, ఇటు టీడీపీ వర్గాల్లోనూ చక్కర్లు కొడుతోంది.
పనితీరు మార్చుకోండి లేదంటే..
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదుపై చంద్రబాబు నేతలకు టార్గెట్ ఇచ్చారు. ఈ సభ్యత్వ నమోదుపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రుల్ని, ఇతర పార్టీ నేతల్ని వివరాల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రామచంద్రాపురం ఎమ్మెల్యే, మంత్రి సుభాష్‌కు తన నియోజకవర్గంలో 9వేల వరకు సభ్యత్వ నమోదు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ సభ్యత్వ నమోదు విషయంలో మంత్రి సుభాష్ పనితీరు సరిగ్గా లేదని కేవలం 29 శాతం మాత్రమే చేశారని చిందులు తొక్కారు చంద్రబాబు.
Comments
Please login to add a commentAdd a comment