Subash
-
ఎవరికో ఒకరికి క్లాస్ పీకుతుంటేనే బెటర్!
-
మీరు ప్రూవ్ చేసుకోకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సి ఉంటుంది..!
సాక్షి,రామచంద్రాపురం : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మంత్రి సుభాష్‌కు చంద్రబాబు అక్షింతలు వేసిన ఆడియోను ఆయన వ్యతిరేక వర్గం లీక్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు విషయంలో వెనుకబడిన మంత్రి సుభాష్‌ను తీవ్రంగా హె చ్చరించారు చంద్రబాబుతొలిసారి ఎమ్మెల్యే, మంత్రైన సుభాష్.. పనితీరు మార్చుకోవాలంటూ చివాట్లు పెట్టారు. ‘పార్టీకి ఉపయోగపడని రాజకీయాలు మీకెందుకయ్యా? ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం చేస్తారయ్యా? ఎవ్రిడే మీకు టెస్టే.. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఏ ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని మీరూ ప్రూవ్ చేసుకోవాలి.లేదంటే మేం ఆల్టర్నేట్ చూస్తాం’ అని ఫోన్లో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్ధంగాక మంత్రి సుభాష్ నీళ్లు నమిలారు. ఆ ఆడియో అటు సోషల్ మీడియాలోనూ, ఇటు టీడీపీ వర్గాల్లోనూ చక్కర్లు కొడుతోంది. పనితీరు మార్చుకోండి లేదంటే..ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదుపై చంద్రబాబు నేతలకు టార్గెట్ ఇచ్చారు. ఈ సభ్యత్వ నమోదుపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రుల్ని, ఇతర పార్టీ నేతల్ని వివరాల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రామచంద్రాపురం ఎమ్మెల్యే, మంత్రి సుభాష్‌కు తన నియోజకవర్గంలో 9వేల వరకు సభ్యత్వ నమోదు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ సభ్యత్వ నమోదు విషయంలో మంత్రి సుభాష్ పనితీరు సరిగ్గా లేదని కేవలం 29 శాతం మాత్రమే చేశారని చిందులు తొక్కారు చంద్రబాబు. -
తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి కు " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
సుభాష్‌ను క్షమించేశా..గీతికా త్యాగి
ముంబై: తనను లైంగికంగా వేధించిన ‘జోలీ ఎల్ఎల్బీ’ సినిమా డెరైక్టర్ సుభాష్ కపూర్‌ను క్షమించేశానని బాలీవుడ్ నటి గీతికా త్యాగి వ్యాఖ్యానించింది. ఏడాది కిందట తనను సుభాష్ లైంగికంగా వేధిస్తుండగా రహస్యంగా వీడియో తీసి, దాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసి త్యాగి సంచలనం సృష్టించింది. ఈ 31 నిమిషాల నిడివి గల వీడియోలో కపూర్ చేష్టలు, దానికి కోపోద్రిక్తురాలైన త్యాగి అతడి చెంప ఛెళ్లుమనిపించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఆ వీడియో క్లిప్పింగ్‌ను కపూర్ భార్య డింపుల్ ఖర్బందా, త్యాగి బాయ్ ఫ్రండ్- డెరైక్టర్ అయిన అతుల్ సబర్వాల్ సైతం వీక్షించారు. కాగా, ఈ ఘటనపై కపూర్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను సినిమా రంగంలోకి వచ్చిన ఎనిమిదిన్నరేళ్ల కాలంలో ఇటువంటి అనుచిత ప్రవర్తనకు ఎన్నడూ పాల్పడలేదని ఆవేదన చెందాడు. దీనికి తాను చాలా సిగ్గుపడుతున్నానన్నాడు. కాగా, కపూర్ భార్య డింపుల్ తన కుమారుడి భవిష్యత్తును తలుచుకుంటూ తీవ్రంగా చింతించింది. ఇదిలా ఉండగా, ఒన్ బై టూ, వాట్ ద ఫిష్ సినిమాల ద్వారా హీరోయిన్గా మారిన జర్నలిస్ట్ గీతికా త్యాగి సైతం ఈ ఘటనతో చాలా కృంగిపోయింది. ఈ సంఘటన తర్వాత తాను ఎవరినీ నమ్మలేని స్థితికి వచ్చేశానని తెలిపింది. తనకు కపూర్ కుటుంబంతో ఎనిమిదేళ్లుగా మంచి స్నేహపూరిత సంబంధాలు ఉన్నాయని.. ఆ సమయంలో కపూర్ ప్రవర్తనలో ఎన్నడూ తప్పుడు సంకేతాలు లేవని చెప్పింది. తన అనుచిత ప్రవర్తనకు కపూర్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఆ కుటుంబ సంక్షేమం దృష్ట్యా కపూర్‌ను క్షమించేశానని ఆమె ప్రకటించింది. కాగా, తాను వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసేందుకు ప్రోత్సహించిన తన బాయ్‌ఫ్రెండ్, ‘ఔరంగజేబ్’ డెరైక్టర్ సబర్వాల్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఆమెకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సబర్వాల్ తిరిగి ట్వీట్ చేశాడు.