సుభాష్‌ను క్షమించేశా..గీతికా త్యాగి | I excuse Subash, says Githika thyagi | Sakshi
Sakshi News home page

సుభాష్‌ను క్షమించేశా..గీతికా త్యాగి

Published Fri, Feb 21 2014 2:36 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సుభాష్‌ను క్షమించేశా..గీతికా త్యాగి - Sakshi

సుభాష్‌ను క్షమించేశా..గీతికా త్యాగి

ముంబై: తనను లైంగికంగా వేధించిన ‘జోలీ ఎల్‌ఎల్‌బీ’ సినిమా డెరైక్టర్ సుభాష్ కపూర్‌ను క్షమించేశానని బాలీవుడ్ నటి గీతికా త్యాగి వ్యాఖ్యానించింది. ఏడాది కిందట తనను సుభాష్ లైంగికంగా వేధిస్తుండగా రహస్యంగా వీడియో తీసి, దాన్ని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి త్యాగి సంచలనం సృష్టించింది. ఈ 31 నిమిషాల నిడివి గల వీడియోలో కపూర్ చేష్టలు, దానికి కోపోద్రిక్తురాలైన త్యాగి అతడి చెంప ఛెళ్లుమనిపించిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఆ వీడియో క్లిప్పింగ్‌ను కపూర్ భార్య డింపుల్ ఖర్బందా, త్యాగి బాయ్ ఫ్రండ్- డెరైక్టర్ అయిన అతుల్ సబర్వాల్ సైతం వీక్షించారు. కాగా, ఈ ఘటనపై కపూర్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను సినిమా రంగంలోకి వచ్చిన ఎనిమిదిన్నరేళ్ల కాలంలో ఇటువంటి అనుచిత ప్రవర్తనకు ఎన్నడూ పాల్పడలేదని ఆవేదన చెందాడు.

దీనికి తాను చాలా సిగ్గుపడుతున్నానన్నాడు. కాగా, కపూర్ భార్య డింపుల్ తన కుమారుడి భవిష్యత్తును తలుచుకుంటూ తీవ్రంగా చింతించింది. ఇదిలా ఉండగా, ఒన్ బై టూ, వాట్ ద ఫిష్ సినిమాల ద్వారా హీరోయిన్‌గా మారిన జర్నలిస్ట్ గీతికా త్యాగి సైతం ఈ ఘటనతో చాలా కృంగిపోయింది. ఈ సంఘటన తర్వాత తాను ఎవరినీ నమ్మలేని స్థితికి వచ్చేశానని తెలిపింది. తనకు కపూర్ కుటుంబంతో ఎనిమిదేళ్లుగా మంచి స్నేహపూరిత సంబంధాలు ఉన్నాయని.. ఆ సమయంలో కపూర్ ప్రవర్తనలో ఎన్నడూ తప్పుడు సంకేతాలు లేవని చెప్పింది. తన అనుచిత ప్రవర్తనకు కపూర్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఆ కుటుంబ సంక్షేమం దృష్ట్యా కపూర్‌ను క్షమించేశానని ఆమె ప్రకటించింది. కాగా, తాను వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసేందుకు ప్రోత్సహించిన తన బాయ్‌ఫ్రెండ్, ‘ఔరంగజేబ్’ డెరైక్టర్ సబర్వాల్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. కాగా, ఆమెకు తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని సబర్వాల్ తిరిగి ట్వీట్ చేశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement