Ramachandra Puram
-
మీరు ప్రూవ్ చేసుకోకపోతే ఆల్టర్నేటివ్ ఆలోచించాల్సి ఉంటుంది..!
సాక్షి,రామచంద్రాపురం : రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మంత్రి సుభాష్‌కు చంద్రబాబు అక్షింతలు వేసిన ఆడియోను ఆయన వ్యతిరేక వర్గం లీక్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు విషయంలో వెనుకబడిన మంత్రి సుభాష్‌ను తీవ్రంగా హె చ్చరించారు చంద్రబాబుతొలిసారి ఎమ్మెల్యే, మంత్రైన సుభాష్.. పనితీరు మార్చుకోవాలంటూ చివాట్లు పెట్టారు. ‘పార్టీకి ఉపయోగపడని రాజకీయాలు మీకెందుకయ్యా? ఎమ్మెల్యేగా, మంత్రిగా ఏం చేస్తారయ్యా? ఎవ్రిడే మీకు టెస్టే.. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఏ ఎన్నికలు వచ్చినా మిమ్మల్ని మీరూ ప్రూవ్ చేసుకోవాలి.లేదంటే మేం ఆల్టర్నేట్ చూస్తాం’ అని ఫోన్లో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్ధంగాక మంత్రి సుభాష్ నీళ్లు నమిలారు. ఆ ఆడియో అటు సోషల్ మీడియాలోనూ, ఇటు టీడీపీ వర్గాల్లోనూ చక్కర్లు కొడుతోంది. పనితీరు మార్చుకోండి లేదంటే..ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సభ్యత్వ నమోదుపై చంద్రబాబు నేతలకు టార్గెట్ ఇచ్చారు. ఈ సభ్యత్వ నమోదుపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రుల్ని, ఇతర పార్టీ నేతల్ని వివరాల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా రామచంద్రాపురం ఎమ్మెల్యే, మంత్రి సుభాష్‌కు తన నియోజకవర్గంలో 9వేల వరకు సభ్యత్వ నమోదు చేయాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ సభ్యత్వ నమోదు విషయంలో మంత్రి సుభాష్ పనితీరు సరిగ్గా లేదని కేవలం 29 శాతం మాత్రమే చేశారని చిందులు తొక్కారు చంద్రబాబు. -
సంగారెడ్డి: రామచంద్రాపురంలో రోడ్డు పక్కనే మహిళ ప్రసవం
-
అమరావతి పాదయాత్రకు బ్రేక్
-
22 కిలోమీటర్ల దూరంలో...
మంగళాపురం (చల్లపల్లి)/కోడూరు : కృష్ణాజిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద శనివారం గల్లంతైన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్ఐ కోట వంశీధర్ (30) మృతదేహాన్ని మంగళాపురం వద్ద కనుగొన్నారు. ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో పొలానికి వెళ్తున్న రైతులు మంగళాపురం సమీపంలో 9వ నంబర్ పంట కాలువలో బోర్లాపడి ఉన్న మృతదేహాన్ని చూశారు. పోలీసులకు సమాచారమివ్వగా అది వంశీధర్‌దిగా గుర్తించారు. డీఎస్పీ వి.పోతురాజు, సీఐ జనార్ధన్ నేతృత్వంలో మృతదేహానికి ఘటనా స్థలిలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. శనివారం గన్నవరంలో తల్లికి వైద్య పరీక్షలు చేయించి స్వగ్రామం ఇస్మాయిల్ బేగ్‌పేటకు వస్తుండగా పాపవినాశనం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కాలువలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తల్లిని రక్షించిన ఆయన గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 22 కి.మీ.ల దూరంలో ఉన్న మంగళాపురం వద్దకు వంశీధర్ మృతదేహం ప్రవాహంలో కొట్టుకువచ్చింది. ఆదివారం అర్ధరాత్రి వరకు మృతదేహం కోసం నిమ్మగడ్డ లాకుల వద్ద గాలిస్తూనే ఉన్నారు. నీటి ఉధృతి వల్ల మృతదేహం వేగంగా కొట్టుకువెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇస్మాయిల్ బేగ్‌పేటకు తీసుకురావడంతో దివిసీమకు చెందిన పోలీసులు వంశీధర్‌కు నివాళులర్పించేందుకు తరలివచ్చారు. జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వంశీధర్ మృతదేహాన్ని సందర్శించి, అతని తల్లిదండ్రులను ఓదార్చారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ, రామచంద్రాపురం డీఎస్పీ జేవీ సంతోష్‌లు కూడా వంశీధర్‌కు నివాళులర్పించారు. తనతో పాటు కానిస్టేబుల్, ఎస్ఐ శిక్షణ పొందిన వారు కూడా వంశీధర్ మృతదేహాన్ని కడసారిగా తిలకించి, కన్నీటి పర్యంతమైయ్యారు. మచిలీపట్నానికి చెందిన ప్రత్యేక పోలీస్ దళం వంశీధర్ ఇంటి వద్ద శాఖాపరమైన నివాళులర్పించారు. సాయంత్రం కోడూరులో సాయుధ వందనం అనంతరం పోలీసు లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, హోంమంత్రి చినరాజప్ప వంశీధర్ కుటుంబీకులను ఫోన్ ద్వారా పరామర్శించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వంశీధర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
రామచంద్రాపురంలో దారుణం:భార్యను చంపిన భర్త
-
రామచంద్రాపురంలో దారుణం:భార్యను చంపిన భర్త
రామచంద్రాపురం:తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపేశాడో భర్త. కంప్యూటర్ శిక్షణ కోసం వెళ్లిన భార్యను ఆ సెంటర్ కు వెళ్లి మరీ పొట్టనపెట్టుకున్నాడు. కె.గంగవరానికి చెందిన వెంకటమాణిక్యాలరావుకు, అదే మండలం పామర్రుకు చెందిన సునీతకు 2009లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇరువురి మధ్య గతంలో గొడవలు రావడంతో రెండేళ్ల క్రితం విడిపోయారు. గత రెండేళ్లుగా సునీత తల్లివద్దే ఉంటుంది. గొడవల నేపధ్యంలో గంగవరం పోలీస్ స్టేషన్ లోమాణిక్యాలరావుపై వరకట్న వేధింపులకింద కేసు నమోదైంది. ఏమైందోగానీ ఇవాళ ద్రాక్షారామలో కత్తికొనుగోలు చేసి, నేరుగా భార్య కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్న సెంటర్ వద్దకు వెళ్లి ఆమె మెడపై కత్తితో నరికాడు. తీవ్రగాయాలతో రక్తస్రావమై సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం మాణిక్యాలరావు సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఈ అకృత్యానికి పాల్పడినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు. -
వీరికోసం మహానేత సాహసోపేత నిర్ణయాలు..
రామచంద్రాపురం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మైనార్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని పటాన్చెరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణానికి చెందిన మైనార్టీలు పెద్ద ఎత్తున వైఎస్సా ర్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలతోపాటు తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలు నచ్చిన అనేకమంది యువకులు, మహిళలు స్వచ్ఛం దంగా ముందుకు వచ్చి వైఎస్సార్ సీపీ లో చేరుతున్నారన్నారు. మైనార్టీలు అన్ని రంగాల్లో ముందుండేలా మహా నేత వైఎస్సార్ ఎంతో కృషి చేశారన్నారు. ప్రధానంగా విద్యారంగంతోపాటు రిజ ర్వేషన్ విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. దేశం లో ఎక్కడా లేని విధంగా వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆ యన లేనిలోటును ప్రజలు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిలో చూసుకుంటున్నారని తెలిపారు. వైఎ స్సార్ సీపీ మాత్రమే మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. మైనార్టీలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సా ర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నయీమ్, సలీమ్, అన్వర్, అస్లాం పాల్గొన్నారు. -
రేపటి నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి పాదయాత్ర
విడవలూరు, న్యూస్‌లైన్: త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం నుంచి పాదయాత్ర చేయనున్నారు. తొలుత మండలంలోని తీర ప్రాంత పంచాయతీ రామచంద్రాపురం నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. పాదయాత్ర ఇలా రామచంద్రాపురం పంచాయతీలోని పొన్నపూడి పెదపాళెంలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొత్తూరు, దళితవాడ, లక్ష్మీపురం, ప్రశాంతగిరి, వెంకటనారాయణపురం, పొన్నపూడి, బుసిగాడిపాళెం, గిరిజనకాలనీ, చంద్రశేఖరపురం, రవీంద్రపురం, రామచంద్రాపురం వరకు సాయంత్రం ఐదు గంటల దాకా నిర్విరామంగా పాదయాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక సమస్యలు ఆయన తెలుసుకుంటారు. 15వ తేదీ మండలంలోని దండిగుంట, వరిణి, వీరారెడ్డిపాళెం, గాదెలదిన్నె గ్రామాల్లో పాదయాత్ర సాగుతుంది. 16, 17, 18వ తేదీల్లో కోవూరు , 22, 23 తేదీల్లో బుచ్చిరెడ్డిపాళెం , 24, 25 తేదీల్లో కొడవలూరు , 26, 27, 28 తేదీల్లో ఇందుకూరుపేట మండలాల్లో పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్రకు కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల నుంచి భారీగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. -
ట్రాక్టర్ బోల్తా : ఇద్దరి మృతి
ములకలపల్లి, న్యూస్‌లైన్: ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణంపాలైన సంఘటన ముల్కలపల్లి మండలంలోని రామచంద్రాపురం(గొల్లగూడెం) గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నరసింహాపురానికి చెందిన దానే సూరయ్య అనే రైతుకు చెందిన ధాన్యాన్ని అదే గ్రామానికి చెందిన బన్నే రాంబాబు ట్రాక్టర్లో రామచంద్రాపురానికి రవాణా చేశారు. ధాన్యం లోడుతో పాటు మామిళ్లగూడెం, నరసింహాపురం గ్రామాలకు చెందిన ఏడుగురు కూలీలు కూడా వెళ్లారు. అక్కడ ధాన్యం దింపేసి తిరిగి వారు ట్రాక్టర్‌పై స్వగ్రామాలకు వస్తుండగా రామచంద్రాపురం - చాపరాలపల్లి ఎస్సీ కాలనీల మధ్య మూలమలుపులో అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌పై ఉన్న ధాన్యం యజమాని సూరయ్య కుమార్తె, నర్సింహాపురానికి చెందిన ఆళ్లూరి శ్యామల(40), ట్రాక్టర్ నడుపుతున్న మామిళ్లగూడేనికి చెందిన ఊకే ప్రసాద్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న వారు గమనించి 108 సహాయంతో పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అపార్ట్మెంట్లో భారీ పేలుడు
=నలుగురికి గాయాలు =మెదక్ జిల్లాలో ఘటన =ఉలిక్కిపడ్డ రామచంద్రాపురం =గ్యాసే కారణమంటున్న పోలీసులు! రామచంద్రాపురం, న్యూస్‌లైన్: మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని బోన్సాయ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టెక్నీషియన్లు, ఇద్దరు మహిళలు గాయపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా వందలాది మంది ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ కారణంగానే పేలుడు జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి నాలుగు ఫ్లాట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మూడో అంతస్తులో జరిగిన ఘటనతో కింది ఫ్లోర్(211)లో నివసిస్తున్న మహిళలిద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రి పాలయ్యారు. కాగా పేలుడు జరిగిన ఇంట్లో చాలా కాలంగా ఎవరూ ఉండటం లేదు. రహీం, ఖమల్ అనే ఇద్దరు టెక్నిషియన్లు బోన్సాయ్ అపార్ట్మెంట్లో ఇన్‌బిల్ట్ గ్యాస్ వ్యవస్థను మరమ్మతులు చేసేందుకు వచ్చారు. వారు ఇతర ఇళ్లల్లో గ్యాస్ పైపులైన్ పనులను ముగించుకుని మూడో అంతస్తుకు వచ్చి ఇంటి (311) కాలింగ్ బెల్ నొక్కారు. సరిగ్గా అప్పుడే పేలుడు సంభవించింది. ఈ మేరకు గాయపడ్డ టెక్నీషియన్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. రెండో అంతస్తులో(312)లో ఉంటున్న వారు అప్పుడే బయటకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఆ ఫ్లాట్ గోడలు పూర్తిగా కూలిపోయాయి. మొత్తం అపార్ట్మెంట్లోని పలు ఫ్లాట్ల కిటికీ అద్దాలు పగిలాయి. లిఫ్టు ధ్వంసమైంది. పేలుడుతో ఆనుకుని ఉన్న ఇతర అపార్ట్మెంట్ల అద్దాలు, గోడలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు జరగిన ఇంటి యజమాని ప్రకాశ్ అమర్లాల్ బజాజ్ డిల్లీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయిగా పనిచేస్తున్నారు. ఈ గదిలో ఎలాంటి సామగ్రి లేదు. జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. సంగారెడ్డి నుంచి క్లూస్‌టీం కూడా ఇక్కడకు చెరుకుని పరిశోధన నిర్వహించింది. పేలుడు శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని ప్రజలు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన వారిలో డీఎస్పీ కవిత, సీఐలు శ్రీనివాస్, భీంరెడ్డి, ఎస్ఐ రవీందర్‌రెడ్డిలు ఉన్నారు. గ్యాస్‌తోనే పేలుడు! అపార్ట్మెంట్లో పెలుడుకు కారణం గ్యాసేనని నిపుణు లు నిర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న ఇన్బెల్ట్ గ్యాస్ మెకానిక్ రహీం నుంచి పోలీసు అధికారులు వివరాలు సేకరించారు. మంగళవారం గ్యాస్ అన్ని ఫ్లాట్లకు సరఫరా అవుతున్నదీ లేనిదీ పరిశీలిస్తున్న మెకానిక్ ఫ్లాట్ నంబర్ 311 వద్దకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే పేలుడు సంభవించింది. అయితే ఎవరూ లేని ఆ ఫ్లాట్‌లో గ్యాస్వాల్ ఓపెన్ చేసి ఉండడం వల్ల గ్యాస్ అంతా రూంలో నిండి ఉండవచ్చునని, కాలింగ్ బెల్ కొట్టగానే పేలుడు జరిగిందని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణకు వచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.