రామచంద్రాపురం, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే మైనార్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారని పటాన్‌చెరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి జి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణానికి చెందిన మైనార్టీలు పెద్ద ఎత్తున వైఎస్సా ర్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలతోపాటు తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలు నచ్చిన అనేకమంది యువకులు, మహిళలు స్వచ్ఛం దంగా ముందుకు వచ్చి వైఎస్సార్ సీపీ లో చేరుతున్నారన్నారు. మైనార్టీలు అన్ని రంగాల్లో ముందుండేలా మహా నేత వైఎస్సార్ ఎంతో కృషి చేశారన్నారు.
ప్రధానంగా విద్యారంగంతోపాటు రిజ ర్వేషన్ విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. దేశం లో ఎక్కడా లేని విధంగా వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆ యన లేనిలోటును ప్రజలు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో చూసుకుంటున్నారని తెలిపారు. వైఎ స్సార్ సీపీ మాత్రమే మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. మైనార్టీలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సా ర్ సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నయీమ్, సలీమ్, అన్వర్, అస్లాం పాల్గొన్నారు.
వీరికోసం మహానేత సాహసోపేత నిర్ణయాలు..
Published Wed, Apr 16 2014 6:09 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement