అనంతపురం అర్బన్: కదిరి తహసీల్దారు మారుతిపై కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ చర్యలు తీసుకున్నారు. ఆయన్ను కదిరి తహసీల్దారు స్థానం నుంచి రిలీవ్ చేస్తూ..కలెక్టరేట్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: యాంకర్ అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం
పట్టాదారు పాసు పుస్తకం మంజూరుకు తహసీల్దారు లంచం అడుగుతున్నట్లుగా వాయిస్ రికార్డ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో ఆయనపై కదిరి ఆర్డీఓ ద్వారా ప్రాథమిక విచారణ చేయించారు. ఆర్డీఓ ఇచ్చిన నివేదికపై కలెక్టర్ సంతృప్తి చెందలేదు. ఈ వ్యవహారంపై జాయింట్ కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విచారణ అధికారి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment