మత్స్యకారులకు ఉపాధి కల్పించాలి
Published Sun, Jul 31 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
బిజినేపల్లి: కరవు కాటకాల్లో చెరువులు ఎండగా చేపల వేటే జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులకు ప్రభుత్వం జీవనాధారం కల్పించాలని జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు నిర ంజన్ కోరారు. మండల కేంద్రంలో సర్పంచుల సంఘం మండలా«ధ్యక్షుడు గంగనమోని తిరుపతయ్య ఆధ్వర్యంలో ఆదివారం తాలూకా స్థాయి ముదిరాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ ముదిరాజ్ కులాస్తులను బీసీ–డీ నుంచి బీసీ–ఏలకు మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపల వేటే జీవనాధారమైన, వృత్తి పరమైన సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. మత్స్యకారులకు రూ.వెయ్యికోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చే శారు. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను కల్పించాలని మత్స్యకారులకు సామాజిక రక్షణ చట్టాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. నాయకుడు గొర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ముదిరాజ్ కులాస్తులు సామాజికంగా ఆర్థికంగా, విద్యపరంగా, రాజకీయాల్లో రాణించాలని కోరారు. సమావేశంలో మహాసభ మండలాధ్యక్షుడు అల్లోజి, నాయకులు మధు, నిరంజన్, జమ్ములు, జంగయ్య, శేఖర్, వెంకటయ్య, మహేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement