mudirajs
-
ముదిరాజ్‌లను విస్మరించిన పార్టీలను ఓడించాలి
సూర్యాపేట: రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న ముదిరాజ్‌లను రాజకీయంగా విస్మరించిన పార్టీలను త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు బోళ్ల కరుణాకర్ పిలుపునిచ్చారు. బుధవారం సూ ర్యాపేట పట్టణంలో నిర్వహించిన ముదిరాజ్‌ల రాజకీయ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ సీట్లలో ఒక్కటి కూడా ముదిరాజ్‌లకు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. మిగతా రాజకీయ పార్టీలు ముదిరాజ్‌లకు జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని రెండు అగ్రకులాలు మాత్రమే తమ గు ప్పెట్లో పెట్టుకొని అధికారాన్ని చెలాయిస్తున్నాయని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఒక్కటై రానున్న ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలను గెలిపించుకుంటామని తెలిపారు. ముదిరాజ్‌లకు ప్రాధాన్యమిచ్చిన పార్టీ గెలుపునకు పనిచేస్తామన్నారు. యువత రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మరగోని రాజు ముదిరాజ్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో ముదిరాజ్‌లకు అవకాశం ఇస్తే ముది రాజులమంతా కలిసి గెలిపించుకుంటామన్నా రు. ఈర్యాలీలో అరిగే సైదులు ముదిరాజ్, పిట్టల శంకర్ ముదిరాజ్, కోల కరుణాకర్ ముదిరాజ్, చెక్కల వీరభద్రం, సిరికొండ సురేష్, నీలం కృష్ణ , గంగరబోయిన శ్రీను ముదిరాజ్, లొంక అశోక్ ముదిరాజ్, బైరి రామ్మూర్తి ముదిరాజ్, జోర్క లింగయ్య ముదిరాజ్, కర్కాల రమేష్ ముదిరాజ్, చింతల సైదులు ముదిరాజ్, చెక్కల నాగరాజు ముదిరాజ్ పాల్గొన్నారు. -
ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
అల్గునూర్: ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉ న్నానని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ పంచాయతీ పరిధిలోని సుభాష్‌నగర్‌లో మండల ముదిరాజ్ సంఘం ప్రతినిధులతో శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రా మకృష్ణకాలనీ పంచాయతీ పరిధిలోని ఊరచెరువు అభివృద్ధిచేయాలని ముదిరాజ్‌లు కోరుతన్నారని తెలిపారు. ఈ విషయమై చెరువు అభివృద్ధికి మిషన్‌కాకతీయ పథంలో అభివృద్ధికి మంత్రి హరీశ్‌రావుకు ప్రతిపాదనలు కూడా పంపించామని తెలిపా రు. త్వరలోనే చెరువలో పూడితతీత చేపడతామని ముదిరాజ్‌లు చేపలు పెంచుకుని ఉపాధిపొందేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ము దిరాజ్‌కు ఎల్ఎండీపైనే ఆధారపడ్డారని చెరువు అభివృద్ధితో గ్రామంలోని సంఘంసభ్యులు చేప లు పెంచుకుని ఉపాధిపొందాలని సూచించారు. ముదిరాజ్‌ల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా చేపపిల్లలు కూడా పంపిణీ చేస్తోందన్నారు. రామకృష్ణకాలనీలోని పెద్దమ ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి సొంత నిధులు మం జూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్ క మ్యూనిటీ భవన నిర్మాణానికి కూడా త్వరలో ని ధులు మంజూరుచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ముదిరాజ్ సంఘం నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో ఇందిరానగర్ స ర్పంచ్ మెంగని రమేశ్, నుస్తులాపూర్ సింగిల్విం డో చైర్మన్ గుజ్జుల రవీందర్‌రెడ్డి, ఉపసర్పంచ్ ప్ర ణీత్రెడ్డి, వార్డుసభ్యుడు దావు సంపత్‌రెడ్డి, ముదిరాజ్ నాయకులు సిద్ద దాసు, భూమయ్య, పండు గ రాజు, కొమురయ్య, చంద్రయ్య, నాయకులు సుగుర్తి జగదీశ్వరాచారి, నాగేందర్, పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గన్నేరువరం: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయ మని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మండలంలోని గోపాల్‌పూర్‌లో హన్మాజిపల్లె గ్రా మానికి చెందిన రజితకు రూ.10 వేలు, మైలారం గ్రామానికి చెందిన సంతోష్‌కు రూ. 6వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం వారికి అందించారు. అనంతరం గ్రామానికి చెందిన, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ ఆకుల సంతోశ్ తండ్రి ఆకుల నర్సయ్య ఇటీవల మృతిచెందగా వారి కు టుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామం లోని సమస్యలపై గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు. సీసీ రోడ్లు వేయాలని గ్రామస్తులు కోరా రు. రైతు బంధు పథకంలో చెక్కులను మరికొంత మంది రైతులకు రాలేదని వాటిని ఇప్పించాలని రై తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. రైతుల సంక్షేమానికై రైతు బంధు, రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అర్హులైన వారందరికి ఈ పథకాన్ని వర్తింపజేయడం తమ లక్ష్యమన్నా రు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రా వు, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, మండల కోఆర్డినేటర్ బోడ మాధవరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ న్యాత సుధాకర్, ఆర్ఎస్ఎస్ జిల్లా డైరెక్టర్ గొల్లపల్లి, సర్పంచు గువ్వ వీరయ్య, యూత్, బీసీ సెల్ మండల అధ్యక్షులు బొడ్డు సునిల్, అటికం రవి, ఉపాధ్యక్షుడు చింతలపల్లి నర్సింహరెడ్డి, కొర్వి తిరుపతి, గ్రామశాఖ అధ్యక్షుడు తాళ్ళపల్లి అనిల్‌గౌడ్, తాళ్ళపల్లి శ్రీనివాస్‌గౌడ్, నూనే చంద్రారెడ్డి, పుల్లెల నరేందర్ పాల్గొన్నారు. -
ముదిరాజ్‌లకు ఐదెకరాల స్థలం.. రూ.5 కోట్లు
హైదరాబాద్: ముదిరాజ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని కోకాపేట సమీ పంలో అత్యంత విలువైన ఐదెకరాల స్థలం, రూ.ఐదు కోట్ల నిధులను కేటాయిస్తూ ఈ నెల 26న జీవో నంబర్ 4 విడుదల చేసింద ని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండా ప్రకాశ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలిపారు. తమ సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కృతజ్ఞతా పూర్వకంగా మంగళవారం నారాయణగూడలోని ముదిరాజ్ మహాసభ కార్యాలయం వద్ద కేసీఆర్ చిత్రపటానికి ముదిరాజ్‌లు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్‌కు పాలాభిషేకాలు, మిఠాయిల పంపిణీ, ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ముదిరాజ్‌లకు కేటాయించిన స్థలంలో త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు రాష్ట్ర వ్యాప్తంగా 650 కమ్యూనిటీ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఒక్కో భవన నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించిందన్నారు. ముదిరాజ్‌లు, మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లకు కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మహాసభ ప్రతినిధులు నీల రాములు, ప్రొఫెసర్ దినేశ్, సాంబయ్య, డి.వెంకటేశ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు ఉపాధి కల్పించాలి
బిజినేపల్లి: కరవు కాటకాల్లో చెరువులు ఎండగా చేపల వేటే జీవనాధారంగా బ్రతికే మత్స్యకారులకు ప్రభుత్వం జీవనాధారం కల్పించాలని జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు నిర ంజన్ కోరారు. మండల కేంద్రంలో సర్పంచుల సంఘం మండలా«ధ్యక్షుడు గంగనమోని తిరుపతయ్య ఆధ్వర్యంలో ఆదివారం తాలూకా స్థాయి ముదిరాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ ముదిరాజ్ కులాస్తులను బీసీ–డీ నుంచి బీసీ–ఏలకు మార్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపల వేటే జీవనాధారమైన, వృత్తి పరమైన సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. మత్స్యకారులకు రూ.వెయ్యికోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చే శారు. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను కల్పించాలని మత్స్యకారులకు సామాజిక రక్షణ చట్టాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. నాయకుడు గొర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ముదిరాజ్ కులాస్తులు సామాజికంగా ఆర్థికంగా, విద్యపరంగా, రాజకీయాల్లో రాణించాలని కోరారు. సమావేశంలో మహాసభ మండలాధ్యక్షుడు అల్లోజి, నాయకులు మధు, నిరంజన్, జమ్ములు, జంగయ్య, శేఖర్, వెంకటయ్య, మహేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.