సూర్యాపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న ముదిరాజ్ సంఘం నాయకులు
సూర్యాపేట: రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న ముదిరాజ్‌లను రాజకీయంగా విస్మరించిన పార్టీలను త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు బోళ్ల కరుణాకర్ పిలుపునిచ్చారు. బుధవారం సూ ర్యాపేట పట్టణంలో నిర్వహించిన ముదిరాజ్‌ల రాజకీయ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ సీట్లలో ఒక్కటి కూడా ముదిరాజ్‌లకు కేటాయించకపోవడం శోచనీయమన్నారు.
మిగతా రాజకీయ పార్టీలు ముదిరాజ్‌లకు జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని రెండు అగ్రకులాలు మాత్రమే తమ గు ప్పెట్లో పెట్టుకొని అధికారాన్ని చెలాయిస్తున్నాయని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఒక్కటై రానున్న ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలను గెలిపించుకుంటామని తెలిపారు. ముదిరాజ్‌లకు ప్రాధాన్యమిచ్చిన పార్టీ గెలుపునకు పనిచేస్తామన్నారు.
యువత రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మరగోని రాజు ముదిరాజ్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో ముదిరాజ్‌లకు అవకాశం ఇస్తే ముది రాజులమంతా కలిసి గెలిపించుకుంటామన్నా రు. ఈర్యాలీలో అరిగే సైదులు ముదిరాజ్, పిట్టల శంకర్ ముదిరాజ్, కోల కరుణాకర్ ముదిరాజ్, చెక్కల వీరభద్రం, సిరికొండ సురేష్, నీలం కృష్ణ , గంగరబోయిన శ్రీను ముదిరాజ్, లొంక అశోక్ ముదిరాజ్, బైరి రామ్మూర్తి ముదిరాజ్, జోర్క లింగయ్య ముదిరాజ్, కర్కాల రమేష్ ముదిరాజ్, చింతల సైదులు ముదిరాజ్, చెక్కల నాగరాజు ముదిరాజ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment