శ్రవణ్ రాక.. టీ కాంగ్రెస్లో కాక | sravan joining creates differences in congress | Sakshi
Sakshi News home page

శ్రవణ్ రాక.. టీ కాంగ్రెస్లో కాక

Published Sat, Apr 12 2014 4:40 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

శ్రవణ్ రాక.. టీ కాంగ్రెస్లో కాక - Sakshi

శ్రవణ్ రాక.. టీ కాంగ్రెస్లో కాక

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే విభేదాలు భగ్గుమన్నాయి. టీఆర్ఎస్ నుంచి వచ్చిన శ్రవణ్ను టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించడాన్ని పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. షబ్బీర్‌ అలీ పదవిని తీసి శ్రవణ్‌కు ఇవ్వడం సరికాదని, ఈ విషయంలో పొన్నాల పునరాలోచించకపోతే అందరం రాజీనామా చేసి తమ నిరసన తెలియజేస్తామని సీనియర్ నాయకుడు నిరంజన్‌ హెచ్చరించారు.

దాసోజు శ్రవణ్తో పాటు కట్టెల శ్రీనివాస యాదవ్ కూడా టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వెంటనే పొన్నాల వారికి పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో శ్రవణ్ను టీ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధిగా నియమించారు. ఇదే ఇప్పుడు పార్టీలో విభేదాలకు కారణమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement