నిరంజన్(ఫైల్)
హైదరాబాద్: ఎంఐఎం నేతల ఆస్తులు కాపాడేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టు అలైన్ మెంట్ మార్చిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నిరంజన్ ఆరోపించారు. ఎంఐఎంను సంప్రదించకుండా మెట్రో రైలు ప్రాజెక్టు మార్పులపై నిర్ణయం తీసుకునే దమ్ము సీఎం కేసీఆర్ కు ఉందాని ప్రశ్నించారు. పాత అలైన్ మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ సమస్య, పింఛన్లు, రుణమాఫీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి పి. శంకర్రావు కోరారు. రుణమాఫీపై ప్రభుత్వమే బ్యాంకులకు గ్యారెంటీ ఇవ్వాలని సూచించారు. పించన్లు అందక వృద్ధులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.