
వి.హనుమంతరావు (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అంజన్‌కుమార్ యాదవ్ పేరును ఇటీవల ఖరారు చేసింది. అయితే తనకు మాట మాత్రమైనా చెప్పకుండా గ్రేటర్ అధ్యక్షుడి నియామకం జరగడంతో మాజీ మంత్రి దానం నాగేందర్ మనస్తాపం చెందారనీ, ఆయన కాంగ్రెస్ పార్టీని వీడనున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. దానం శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది.
ఆయన శనివారం కేసీఆర్ సమక్షంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారనే కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ పార్టీని వీడడం కాంగ్రెస్‌కు నష్టమేనని వ్యాఖ్యానించారు. రేపు ఉదయంలోగా దానంతో మాట్లాడి మనసు మార్చుకొనేలా ప్రయత్నిస్తామని అన్నారు. జానారెడ్డి నివాసంలో సమావేశమై పార్టీ నాయకత్వం ఈ విషయంపై చర్చించిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment