బంజారాహిల్స్: ‘ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అపోహలు, వదంతులు నమ్మొద్దు’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పెద్ద సంఖ్యలో విచ్చేసిన కార్యకర్తల సమక్షంలో స్పష్టం చేశారు. ఫిలింనగర్ బస్తీల్లో పాదయాత్ర చేయడానికి వచ్చిన ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ముఖ్యమంత్రికి అన్నీ తెలుసని, ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తనే నిలబడతానని వెల్లడించారు.
కొంత మంది యూట్యూబ్ చానళ్లు పెట్టుకొని పనికిమాలిన వార్తలను ప్రసారం చేస్తుంటారని, అదే పనిగా వైరల్ చేస్తున్నారని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో మరోసారి గులాబీ జెండా గుబాళిస్తుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment