
సాక్షి, హైదరాబాద్(ఖైరతాబాద్) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత వాతావరణం, ప్రజానాడి హస్తానికే మొగ్గు ఉందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ చెబుతుంటే మరోవైపు ఆయన సతీమణి పద్మ టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఖైరతాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ సతీమణి అనితతో కలిసి ఆమె మంగళవారం రాత్రి ఖైరతాబాద్ డివిజన్‌లో ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ.. దానం నాగేందర్ అన్నను గెలిపించాలని కోరారు. ఏ ప్రభుత్వమూ ఐదేళ్లలో పనులన్నీ పూర్తి చేయలేదన్నారు. పదేళ్లలో సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్‌ను గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment