
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఉత్తమ్ శనివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వార్ రూమ్ లో కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్‌తో సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఉత్తమ్ హైకమాండ్‌తో చర్చించునున్నట్టు తెలుస్తోంది. అలాగే కొత్త కమిటీ ఏర్పాటు, సంస్థాగత మార్పులపై చర్చించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment