
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఊహాగానాలకు తెరదించుతూ... టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తెలంగాణ తొలి అసెంబ్లీని రద్దు చేసేశారు. ముందస్తు ఎన్నికలకు సంకేతాలిస్తూ.. అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించారు. నవంబర్‌లో ఎన్నికలు జరిగి, డిసెంబర్‌లో ఫలితాల ప్రకటన వచ్చే అవకాశముందని కూడా ప్రెస్ మీట్‌లో తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో 105 మందికి టిక్కెట్లు కేటాయించారు. అయితే మరికొన్ని స్థానాలను, అభ్యర్థులను కేసీఆర్ పక్కనబెట్టారు.
కేసీఆర్ జాబితాలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కనిపించలేదు. దానం నాగేందర్‌కు హామీ దొరకలేదని తెలుస్తోంది. అంతేకాక వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ స్థానాన్ని కూడా కేసీఆర్ పెండింగ్‌లో పెట్టారు. మేడ్చల్ టిక్కెట్‌నూ కేసీఆర్ ప్రకటించలేదు. మేడ్చల్ టిక్కెట్ కోసం కాంగ్రెస్ నేత కేఎల్‌ఆర్ ఫామ్ హౌజ్‌లో ఉన్నట్టు తెలిసింది. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభకు కూడా కేసీఆర్ టిక్కెట్ ప్రకటించిలేదు. హుజూర్ నగర్, కోదాడ, అంబర్‌పేట, మల్కాజిగిరి, వికారాబాద్ స్థానాలను కూడా కేసీఆర్ పెండింగ్‌లో ఉంచారు. కేసీఆర్ ప్రకటించిన ఈ జాబితా బట్టి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు చోట్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉన్న స్థానం కోదాడలోనూ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించలేదని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment