CM KCR Will Announce Assembly Candidates First List Of BRS; Check Here BRS Assembly Candidates First List - Sakshi
Sakshi News home page

స్పీడ్‌ పెంచిన గులాబీ బాస్‌.. తొలి లిస్ట్‌లో అభ్యర్థులు వీరే!

Published Thu, Aug 17 2023 10:50 AM | Last Updated on Thu, Aug 17 2023 2:43 PM

CM KCR Will Announce Assembly Candidates First List Of BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల హీట్‌ మొదలైంది. మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్య​ర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అధికార పార్టీ సైతం అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

వివరాల ప్రకారం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్‌ స్పీడ్‌ పెంచారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్‌ సిద్దం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈనెల 21న కేసీఆర్‌ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి సుమారు 80 నుంచి 90 మంది అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేసినట్టు సమాచారం. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. 

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా అంచనా ప్రకారం.. 

ఉమ్మడి ఆదిలాబాద్..  
చెన్నూరులో బాల్క సుమన్
అదిలాబాద్‌లో జోగు రామన్న
బోథ్‌లో రాథోడ్ బాపురావు
ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు
నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ 
ఆర్మూర్‌లో జీవన్ రెడ్డి
బోధన్‌లో షకీల్
బాన్సువాడలో పోచారం శ్రీనివాస్‌
నిజామాబాద్‌ అర్బన్‌లో గణేష్ బిగాలా
నిజామాబాద్ రూరల్‌లో బాజిరెడ్డి గోవర్దన్
బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి

కరీంనగర్
కరీంనగర్‌లో గంగుల కమలాకర్
సిరిసిల్లలో కేటీఆర్
మనకొండురులో రసమయి బాలకిషన్
రామగుండంలో కోరుగంటి చందర్
కోరుట్లలో విద్యాసాగర్ రావు/ సంజీవ్
హుస్నాబాద్‌లో ఒడితల సతీష్

మెదక్
సిద్దిపేటలో హరీష్ రావు
దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్‌లో కేసిఆర్
పఠాన్ చేరులో గూడెం మహిపాల్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా
మేడ్చల్‌లో మల్లారెడ్డి
మల్కాజ్‌గిరిలో మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద
కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు
ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బీనగర్‌లో దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి
శేర్లింగంపల్లిలో అరికెపూడి గాంధీ
వికారాబాద్‌లో మెతుకు ఆనంద్
తాండూరులో పైలెట్ రోహిత్ రెడ్డి

హైదరాబాద్
ముషీరాబాద్‌లో ముఠాగోపాల్
ఖైరతాబాద్‌లో దానం నాగేందర్
జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్
సనత్ నగర్‌లో తలసాని శ్రీనివాస్
సికింద్రాబాద్‌లో పద్మారావు

మహబూబ్‌ నగర్‌
కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డి
జడ్చర్లలో లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్‌
దేవరకద్రలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మక్తల్‌లో చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తిలో నిరంజన్ రెడ్డి
నాగర్ కర్నూల్‌లో మర్రి జనార్దన్ రెడ్డి

నల్గొండ
సూర్యాపేటలో జగదీష్ రెడ్డి
నల్గొండలో కంచర్ల భూపాల్ రెడ్డి
హుజూర్‌నగర్‌లో శానంపూడి సైదిరెడ్డి
భువనగిరిలో పైళ్ల శేఖర్ రెడ్డి
నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తిలో గాదరి కిషోర్
ఆలేరులో గొంగిడి సునీత

ఖమ్మం
పినపాకలో రేగా కాంతారావు
ఇల్లందులో బానోతు హరిప్రియ నాయక్
ఖమ్మంలో పువ్వాడ అజయ్
పాలేరులో కందాల ఉపేందర్ రెడ్డి
సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య

ఉమ్మడి వరంగల్
పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు
నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాలలో చల్ల ధర్మారెడ్డి
వరంగల్ పశ్చిమలో దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ తూర్పులో వద్దిరాజు రవిచంద్ర
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి
జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి 
వర్ధన్నపేటలో ఆరూరి రమేష్
భూపాలపల్లిలో గండ్ర వెంకట రమణారెడ్డి.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement