తన మద్దతుదారులు అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో కాంగ్రెస్ పార్టీ నేత దానం నాగేందర్ గురువారం కీలక భేటీ నిర్వహించారు.
హైదరాబాద్: తన మద్దతుదారులు అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో కాంగ్రెస్ పార్టీ నేత దానం నాగేందర్ గురువారం కీలక భేటీ నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా పార్టీ మారడంపై ఆయనవారి నుంచి అభిప్రాయాలు కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మారడంపై అనుచరుల మధ్యలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కొందరు అనుచరుల కోరగా.. టీఆర్ఎస్ లోకి వెళ్దామని మరికొందరు దానానికి సూచించినట్లు చెప్పారు. కాగా, ఒక వేళ కాంగ్రెస్ లో ఉండాలంటే మొత్తం 150 డివిజన్ల అభ్యర్థుల ఎంపికను దానంకే అప్పగించాలని మాజీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. అయితే, పార్టీ మార్పుపై మాత్రం దానం ఇంకా నోరు విప్పలేదు.