బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను లక్ష్యంగా చేసుకుని ఎంపీ ధర్మపురి అర్వింద్ చేస్తున్న వ్యక్తిగత దాడిని ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకునేది లేదని, పద్ధతి మార్చుకోకపోతే ప్రజల చేతిలో చావుదెబ్బతినాల్సి వస్తుందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. శనివారం ఆయన కవితను కలసి సంఘీభావం తెలిపారు.
అనంతరం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కలసి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అర్వింద్ మాటలు వింటే ప్రజల రక్తం మరిగిపోతోంద న్నారు. కాంగ్రెస్ పార్టీలో బీఫారమ్స్ అమ్ముకున్న చిల్లర వ్యక్తి అరవింద్ ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment