
టీఆర్‌ఎస్‌లో చేరను: దానం
టీఆర్‌ఎస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ స్పష్టం చేశారు.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని వెల్లడించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యలను ప్రస్తావించే విపక్ష నేతలను కించపరిచేలా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ నెల 19న నిర్వహించనున్న ఇంటింటి సర్వేలో భాగస్వాములు అయ్యేందుకు ఊరికి వెళ్తున్న నగరంలోని పేదలకు ప్రభుత్వమే భత్యం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఎంఐఎంతో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.