రాబోయే రోజుల్లో ఊహించనివిధంగా నిరసనలు.. | Unexpectedly protests in the coming days danam said | Sakshi
Sakshi News home page

రాబోయే రోజుల్లో ఊహించనివిధంగా నిరసనలు..

Published Fri, Apr 7 2017 7:43 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

రాబోయే రోజుల్లో ఊహించనివిధంగా నిరసనలు.. - Sakshi

రాబోయే రోజుల్లో ఊహించనివిధంగా నిరసనలు..

రాబోయే రోజుల్లో ఊహించని విధంగా నిరసనలు ఉంటాయని, జరగబోయే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని దానం నాగేందర్ హెచ్చరించారు.

హైదరాబాద్‌: రాబోయే రోజుల్లో ఊహించని విధంగా నిరసనలు ఉంటాయని, జరగబోయే పరిణామాలకు ప్రభుత్వానిదే  బాధ్యత అని దానం నాగేందర్ హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ.. ధర్నా చౌక్‌ తరలింపు విషయంలో ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే.. డీజీపీ ఆఫీస్ , పోలీస్ కమిషనర్ ఆఫీస్ , హోమ్ మంత్రి ఇంటి ముట్టడి నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 17న ధర్నా చౌక్ తరలింపుకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన చేస్తుందన్నారు. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సత్యగ్రహ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement