
సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారా?
డ్రగ్స్ కేసును విచారిస్తున్న ఉన్నతాధికారికి బెందిరింపు ఫోన్లు వస్తే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోవడం బాధాకరమని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ అన్నారు.
' డ్రగ్స్ కేసు విచారిస్తున్న అధికారులపై ఒత్తిడి ఉంది. సెలబ్రిటీలు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారా.. ఈ కేసులో మిగతా వారి పేర్లు ఎందుకు బయటకు రావడం లేదు. అధికార పార్టీకి చెందిన వాళ్లు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారని మేమనడం లేదు. వాళ్లెందుకు చేస్తారు.. వాళ్లకేం పనిలేదా? తెల్లవారుజామున మూడు గంటల వరకు పబ్స్ నడుపుతున్నా అధికారులు చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని ఓ పబ్ తెల్లవారి వరకు నడుస్తోందని స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. నగరంలో నైజీరియన్లు, సోమాలియన్లు ఎంతమంది ఉన్నారో లెక్కలు ఉన్నాయా.. వారిపై నిఘా ఉందా' అని ప్రశ్నించారు.