త్వరలో బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనం: దానం నాగేందర్‌ | MLA Danam Nagender Senstional Comments On BRS MLAs Defection, See Details Inside | Sakshi
Sakshi News home page

త్వరలో బీఆర్‌ఎస్‌ఎల్పీని విలీనం చేసుకుంటాం: దానం నాగేందర్‌

Published Fri, Jul 12 2024 12:15 PM | Last Updated on Fri, Jul 12 2024 1:16 PM

Mla Danam Nagender Senstional Comments On Brs Mlas Defection

సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వరుస పెట్టి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై శుక్రవారం(జులై 12)  మీడియాతో దానం నాగేందర్‌ మాట్లాడారు. 

‘రెండు రోజుల్లో మరో ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎంఎల్ఏలు కాంగ్రెస్‌లో చేరుతారు. పదిహేను రోజుల్లో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకుంటాం. తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో చేసిన అక్రమాలు వెలికి తీస్తాం. 

కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయటపెడతా. గుండు శ్రీధర్, సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు రాజేష్ రాజు లాంటి వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు. లెక్కలన్నీ బయటకు తీస్తాం’అని హెచ్చరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement