సాక్షి,ఢిల్లీ: బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం వార్తలపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై తమ పార్టీలో ఎటువంటి సంప్రదింపులు జరగలేదని, ఇవన్నీ మీడియా ఊహాగానాలేనని చెప్పారు. శనివారం(ఆగస్టు10) ఢిల్లీలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. "ఏక్ పేడ్ మా కే నామ్ " క్యాంపెయిన్‌లో తల్లిపేరు మీద ప్రతిఒక్కరు మొక్క నాటాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కిషన్‌రెడ్డి తన నివాసంలో తల్లి పేరు మీద రుద్రాక్ష మొక్క నాటారు.
Comments
Please login to add a commentAdd a comment