
'టీఆర్ఎస్ కు ఏజెంట్ లా పనిచేస్తున్నారు'
హైదరాబాద్:జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దానం నాగేందర్ ఆరోపించారు. దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు గురువారం గవర్నర్ నరసింహన్ ను కలిశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన దానం.. డివిజన్ల డీలిమిటేషన్ లో సోమేష్ కుమార్ టీఆర్ఎస్ కు ఏజెంట్ లా పనిచేస్తున్నారని విమర్శించారు. గత ఏడాది ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల ఆధారంగా.. ఆ పార్టీకి అనుకూలంగా డివిజన్ల డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా సోమేష్ కుమార్ ను తప్పించాలని.. లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని దానం పేర్కొన్నారు.