సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు రాష్ట్రానికి ఇచ్చిన వివరాలను ‘రిపోర్టు టు పీపుల్ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.
ఈ సందర్బంగా దానం నాగేందర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి వాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రావాల్సిన నిధులు ఇప్పటివరకు కేంద్రం ఇవ్వలేదు. ఎంపీగా గెలిచిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలి. మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రం చెప్పలేదా?. రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం అడ్డుకుంది.
హైదరాబాద్, తెలంగాణ నుంచి వస్తున్న రిసోర్సెస్ వల్లనే రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. దాని ఆధారంగానే అభివృద్ధి జరుగుతోంది. కిషన్ రెడ్డి ఈ మాయ మాటలు పక్కన పెట్టాలి. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీ. విద్యాసాగర్ రావు హైదరాబాద్ రెండో రాజధాని అంటూ చేసిన కామెంట్స్‌పై కూడా దానం స్పందించారు. తెలంగాణకు రెండో రాజధాని అంటూ బీజేపీ మళ్లీ మాటలు చేప్తోంది. హైదరాబాద్ ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. విద్యాసాగర్‌ను బలిపశువును చేయడానికే బీజేపీ ఇలాంటి స్టేట్‌మెంట్ ఇస్తోంది.
ఇది కూడా చదవండి: రాహుల్‌తో జూమ్ మీటింగ్.. 22న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల!
Comments
Please login to add a commentAdd a comment