C Vidyasagar Rao
-
విద్యాసాగర్ రావును బీజేపీ బలి పశువును చేస్తోంది: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు రాష్ట్రానికి ఇచ్చిన వివరాలను ‘రిపోర్టు టు పీపుల్ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఈ సందర్బంగా దానం నాగేందర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి వాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రావాల్సిన నిధులు ఇప్పటివరకు కేంద్రం ఇవ్వలేదు. ఎంపీగా గెలిచిన తర్వాత సికింద్రాబాద్ నియోజకవర్గానికి కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలి. మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రం చెప్పలేదా?. రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులను కూడా కేంద్రం అడ్డుకుంది. హైదరాబాద్, తెలంగాణ నుంచి వస్తున్న రిసోర్సెస్ వల్లనే రాష్ట్రానికి ఆదాయం వస్తోంది. దాని ఆధారంగానే అభివృద్ధి జరుగుతోంది. కిషన్ రెడ్డి ఈ మాయ మాటలు పక్కన పెట్టాలి. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీ. విద్యాసాగర్ రావు హైదరాబాద్ రెండో రాజధాని అంటూ చేసిన కామెంట్స్‌పై కూడా దానం స్పందించారు. తెలంగాణకు రెండో రాజధాని అంటూ బీజేపీ మళ్లీ మాటలు చేప్తోంది. హైదరాబాద్ ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. విద్యాసాగర్‌ను బలిపశువును చేయడానికే బీజేపీ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తోంది. ఇది కూడా చదవండి: రాహుల్‌తో జూమ్ మీటింగ్.. 22న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల! -
ఉప రాష్ట్రపతి రేసులో ఉత్కంఠ!
రేసులో ముందున్న వెంకయ్యనాయుడు పరిగణనలో సీహెచ్ విద్యాసాగర్‌రావు పేరు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం న్యూఢిల్లీ: బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ వెంట నిత్యం కనిపించిన వ్యక్తి వెంకయ్యనాయుడు. కోవింద్‌కు అడుగడుగునా సహకరించడమే కాదు.. ఆయన వెంట రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో వివిధ రాష్ట్రాలకు వెళ్లారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన వెంట వెంకయ్య నాయుడు కలిసి నడిచే అవకాశముందని జాతీయ మీడియా పేర్కొంటున్నది. ఉప రాష్ట్రపతి రేసులో బీజేపీ తరఫున వెంకయ్యనాయుడు పేరు ముందంజలో ఉందని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ అత్యున్నత నిర్ణాయక విభాగం ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించనుంది. దక్షిణాదికి చెందిన వ్యక్తికే అవకాశం లభించనుందని వినిపిస్తోంది. దక్షిణాదిలో బీజేపీ బలోపేతం కావాలనుకోవడమే ఇందుకు కారణం.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇంకా వెంకయ్యనాయుడు పేరు పూర్తిగా ఖరారు కాలేదని సమాచారం. ప్రధాని మోదీ తన కేబినెట్ సహచరుడిని వదులుకునేందుకు ఇష్టపడితేనే ఆయనకు చాన్స్ దొరకవచ్చునని అంటున్నారు. ఈ కారణంతోనే రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్రమంత్రులకు అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే. వెంకయ్య మాత్రం రాష్ట్రపతి పదవి అంటే తనకు ఏమాత్రం ఇష్టంలేదని తేల్చిచెప్తున్నారు. 'నేను రాష్ట్రపతికానీ, ఉప రాష్ట్రపతికానీ కావాలనుకోవడం లేదు. ఉషాపతి (వెంకయ్య భార్య ఉషా)గా ఉండటమే నాకు ఇష్టం' అని ఆయన కుండబద్దలు కొట్టారు. ఉపరాష్ట్రపతి పదవి రేసులో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సాగర్‌జీకి కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని జాతీయ మీడియా పేర్కొంటున్నది. ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దొరుకుతుంది.. చివరినిమిషంలో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వస్తుందా? వేచిచూడాలి. -
మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భారీ అగ్నిప్రమాదం
- సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా వేదికకు మంటలు - సురక్షితంగా బయటపడిన వీఐపీలు, సినీతారలు, ప్రజలు - షార్ట్‌సర్క్యూటే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ ముంబై: ముంబైలో నిర్వహిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా’ సాంస్కృతిక కార్యక్రమంలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గిర్గాం చౌపాటి బీచ్‌లో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రదర్శన పూర్తయిన కొద్దిసేపటికి మహారాష్ట్ర లావణీ జానపద నృత్యం జరుగుతుండగా వేదిక కింద మంటలు రేగాయి. రాత్రి 8.15 గంటల ప్రాంతంలో వేదిక అంటుకోగా... గాలి తీవ్రత వల్ల అవి వేగంగా వ్యాపించడంతో పూర్తిగా ఆహుతైంది. సంఘటన స్థలానికి అగ్నిమాపక శకటాలు చేరుకునేసరికి బుగ్గైంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని బృహన్ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) విపత్తు నిరోధక అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్ విద్యాసాగర్ రావు, శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే, అమితాబ్ బచ్చన్, ఆమిర్‌ఖాన్, హేమమాలిని, కత్రినా కైఫ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. కార్యక్రమానికి హాజరైన దాదాపు 50 వేల మంది ప్రజలు క్షేమంగా బయటపడ్డారు. తప్పించుకునేందుకు సరైన మార్గాలు ఉండడంతో ఎలాంటి తొక్కిసలాట చోటుచేసుకోలేదు. ‘ మరో గంటలో నా ప్రదర్శన ఉంది. నేను మేకప్ వ్యాన్‌లో ఉండగా... నా సిబ్బంది అగ్నిప్రమాదం విషయాన్ని చెప్పారు. వెళ్లిచూడగా స్టేజంతా మంటల్లో చిక్కుకుంది’ అని ఆమిర్ ఖాన్ తన ప్రత్యక్ష అనుభవాన్ని వెల్లడించారు. ప్రమాద సమయంలో పెద్ద సంఖ్యలో వ్యాపార ప్రతినిధులు, పెట్టుబడిదారులు అక్కడే ఉన్నారు. బాణ సంచా వల్ల ప్రమాదం జరిగిందని భావించినా, స్టేజ్ కింద షార్ట్ సర్క్యూట్ వల్లే సంభవించిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 16 అగ్నిమాపక శకటాలు, ఆరు వాటర్ ట్యాంకర్లు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, దీనివల్ల మేక్ ఇన్ ఇండియా పోగ్రాంకు ఎలాంటి ఇబ్బంది కలగదని చెప్పారు. శనివారం ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా వీక్’ కార్యక్రమాన్ని ముంబైలో ప్రారంభించిన విషయం తెలిసిందే. వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో ఈ కార్యక్రమం చేపట్టారు. దాదాపు 2,500 అంతర్జాతీయ, 8 వేల దేశీయ కంపెనీలు వారం పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటున్నాయి. -
అక్టోబర్ 31న మహారాష్ట్ర సర్కార్ ఏర్పాటు?
ముంబై: మహారాష్ట్రలో నూతన ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం అక్టోబర్ 31 తేదిన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దక్షిణ ముంబైలోని వాంఖెడే స్టేడియంలో నిర్వహించే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతారని పార్టీ నేతలు తెలిపారు. బీజేపీ లెజిస్టేచర్ పార్టీ సమావేశం మంగళవారం జరుగుతుందని, ఆ భేటిలోనే శాసనసభ నాయకుడిని ఎన్నుకుంటారన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ సి. విద్యసాగర్ రావును కొత్త నేత కలుసుకుంటారని, అయితే ఎప్పుడు భేటి అవుతారనే విషయంపై ఇంకా స్పష్టత లేదన్నారు. పార్టీ శాసన సభ్యుల సమావేశానికి కేంద్ర పరిశీలకులు రాజ్ నాత్ సింగ్, జేపీ నద్దా, ఓం ప్రకాశ్ మాథూర్, రాజీవ్ ప్రతాప్ రూడీలు హాజరవుతారు.