మండలంలోని కోనలో తేనెటీగల దాడిలో 11 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
యాడికి : మండలంలోని కోనలో తేనెటీగల దాడిలో 11 మంది గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యాడికిలోని ఓంశాంతి కాలనీకి చెందిన వెంకటలకు్ష్మమ్మ కుటుంబ సభ్యులు తాడిపత్రికి చెందిన తమ బంధువులతో కలసి విహార యాత్ర నిమిత్తం కోనకు వెళ్లారని గ్రామస్తులు తెలిపారు.
అక్కడ మధ్యాహ్నం భోజనానంతరం పిల్లలు ఆడుకుంటూ తుట్టపై రాళ్లు రువ్వడంతో తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేసినట్లు వివరించారు. గాయపడ్డ వారిలో వెంకటలక్షు్మమ్మ(65) పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే ఆమెను తాడిపత్రికి తరలించినట్లు వివరించారు.