
ఈటెల, కేటీఆర్ లపై తేనెటీగల దాడి
రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ లపై తేనెటీకలు దాడిచేశాయి.
జగిత్యాల: రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ లపై తేనెటీకలు దాడిచేశాయి. కరీంనగర్ జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులు ఇతరులపై తేనెటీగలు దాడి చేశాయి. బుధవారం ఉదయం జగిత్యాల మండలం నర్సింగాపూర్ గ్రామానికి చేరుకున్నమంత్రులు వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను అధికారులతో కలసి పరిశీలించారు. అది పూర్తయి వెనుదిరుగుతున్న సమయంలో... కొన్ని తేనెటీగలు ఒక్కసారిగా వారిపైకి దూసుకువచ్చాయి. దీంతో మంత్రులు వెంటనే తమ కార్లలోకి వెళ్లి డోర్లు వేసుకోగా, ఇతర నేతలు, అధికారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.