
మామునూరు: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో పలువురుకి తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. వరంగల్ టీఎస్‌ఎస్పీ నాలుగో బెటాలియన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ పాఠశాలలో 2000 –01 పదో తరగతి బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వంట చేస్తుండగా చెట్లపై ఉన్న తేనెటీగలు పూర్వ విద్యార్థులపై దాడి చేశాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఖిలావరంగల్ పడమరకోటకు చెందిన మైదం దయాకర్ (34) ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి మాణిక్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు సీఐ రమేశ్ తెలిపారు.
( చదవండి: అనాథకు తలకొరివి పెట్టిన ముస్లిం మహిళ )
Comments
Please login to add a commentAdd a comment