tssp battalion
-
అనారోగ్యంతో రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ మృతి
నేరడిగొండ: టీఎస్ఎస్పీ బెటాలియన్ రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ కటక్వాల్ నారాయణ్ సింగ్ (59) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మృతిచెందాడు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆయన కుటుంబీకులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం ఇంటికి తీసుకురాగా మృతిచెందాడు. శనివారం మండల కేంద్రంలో టీఎస్ఎస్పీ బెటాలియన్ ఆధ్వర్యంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు. కమాండెంట్లు ఆయన పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్, ఎంపీపీ రాథోడ్ సజన్, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉప సర్పంచ్ దేవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఏలేటి మహేందర్‌రెడ్డి, వీడీసీ చైర్మన్ రవిందర్‌రెడ్డి పరామర్శించారు. -
3 రోజులు సెలవులు.. 28న విధుల్లోకి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్లు కొత్తగా విధుల్లో చేరే ముందు మూడురోజుల సెలవులు దక్కాయి. వీరంతా తమకు కేటాయించిన యూనిట్లలో ఈ నెల 28న ఉదయం రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 బెటాలియన్లలో శిక్షణ పొందుతున్న 3,804 మందికి షెడ్యూల్ ప్రకారం 25వ తేదీన ఉదయం నియామకపత్రాలు ఇవ్వాలి. అలా అయితే, వీరికి మధ్యలో రెండురోజుల గడువు మాత్రమే ఉందని గుర్తించిన అధికారులు 24వ తేదీ సాయంత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. దీంతో 25, 26, 27 తేదీల్లో మూడు రోజులు సెలవులు లభించాయి. -
అంతా కలిసి ఎన్నాళ్లయిందో..! అంతలోనే విషాదం
మామునూరు: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో పలువురుకి తీవ్ర గాయాలు కాగా, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. వరంగల్ టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ పాఠశాలలో 2000 –01 పదో తరగతి బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో వంట చేస్తుండగా చెట్లపై ఉన్న తేనెటీగలు పూర్వ విద్యార్థులపై దాడి చేశాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా, ఖిలావరంగల్ పడమరకోటకు చెందిన మైదం దయాకర్ (34) ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి మాణిక్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు సీఐ రమేశ్ తెలిపారు. ( చదవండి: అనాథకు తలకొరివి పెట్టిన ముస్లిం మహిళ ) -
టీఎస్ఎస్పీ అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కొలువులకు ఎంపికై, దాదాపు ఏడాది నుంచి శిక్షణ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. నవంబర్ 9 నుంచి వీరికి శిక్షణ ప్రారంభంకానుంది. ఈ మేరకు తొలుత ఈ నెల 26 నుంచి కరోనా పరీక్షలకు హాజరుకావాలని అభ్యర్థుల మొబైళ్లకు టీఎస్ఎస్పీ నుంచి సంక్షిప్త సందేశాలు వచ్చాయి. దీంతో 3,963 మంది అభ్యర్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. షెడ్యూల్ ప్రకారం.. అంబర్‌పేట, మేడ్చల్, కరీంనగర్, పోలీసు ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ)ల్లో తొలుత వీరికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ వస్తే శిక్షణ కేంద్రాలకు, పాజిటివ్ వస్తే అక్కడే తాత్కాలిక క్వారంటైన్లో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. వీరి శిక్షణ కోసం ఇప్పటికే మొదటి, మూడవ, ఏడవ, ఎనిమిదవ, 10వ, 13వ, 17వ బెటాలియన్లతోపాటు పీటీసీ వరంగల్, పీటీసీ మేడ్చల్‌తో కలిపి మొత్తం పది కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఏడాది నిరీక్షణ ఫలితం.. వాస్తవానికి 2018లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వుడ్(ఏఆర్), టీఎస్ఎస్పీ విభాగాల్లోని దాదాపు 16వేల కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదలైంది. 2019 సెప్టెంబర్ నాటికి పరీక్షలు, ఫలితాల విడుదల పూర్తయ్యాయి. సివిల్, ఏఆర్ విభాగాలకు ఎంపికైన అభ్యర్థులకు 2020 జనవరి 17న శిక్షణ మొదలైంది. మౌలిక సదుపాయాలు సరిపడా లేకపోవడం, మార్చిలో కరోనా లాక్డౌన్ కారణంగా టీఎస్ఎస్పీ అభ్యర్థుల శిక్షణ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఈలోగా సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల తొమ్మిది నెలల శిక్షణ పూర్తయ్యింది. వారికి పోస్టింగులు కూడా దాదాపు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ఏడాది తరువాత తమకు ఎట్టకేలకు శిక్షణకు పిలుపురావడంపై టీఎస్ఎస్పీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణకు ఇంకా ఎనిమిది రోజులే ఉండటంతో అభ్యర్థులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. -
తుపాకీ మిస్‌ఫైర్..తోటి ఉద్యోగుల చేయూత
సాక్షి, హైదరాబాద్ : తుపాకీ మిస్‌ఫైర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆర్ఎస్ఐ ఆదిత్య సాయి కుమార్ కుటుంబానికి తోటి ఉద్యోగులు ఆర్థిక సహాయం అందించారు. వివరాల ప్రకారం.. ఈనెల 16న ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా టీఎస్ఎస్పీ బెటాలియన్‌కు చెందిన ఆదిత్య సాయి చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో తోటి ఉద్యోగులు ఆదిత్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. అందరూ కలిసి జమచేసిన 27,50,000 రూపాయల చెక్కును ఆదిత్య సాయి కటుంబానికి అందజేశారు. బెటాలియన్ అదనపు డిజిపి అభిలాష్ భిష్తి స్వయంగా చెక్కును అందించారు. కష్టకాలంలో ఆదిత్య కటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆదిత్య కటుంబానికి మరింత అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక కారుణ్య నియామకం కింద ఆదిత్య సోదరుడిని పోలీసు ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?) -
‘చలో డీజీపీ ఆఫీస్’కు టీఎస్ఎస్పీ అభ్యర్థుల పిలుపు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఎస్పీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు బుధవారం ‘చలో డీజీపీ ఆఫీస్’కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయానికి వచ్చిన తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(టీఎస్ఎల్పీఆర్బీ)కు సెలెక్ట్ అయిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలితాలు విడుదలయ్యి దాదాపు 9 నెలల అవుతున్న ఇప్పటి వరకు ట్రైనింగ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు తెలిపారు. తమతో పాటు సెలెక్ట్ అయిన సివిల్, ఏఆర్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి వేతనాలు ఇస్తున్నారన్నారు. కానీ టీఎస్ఎస్పీ అభ్యర్థుల ట్రైనింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని వారు వాపోయారు. శిక్షణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది సెలక్ట్ అయిన అభ్యర్థులు చనిపోయారని తెలపారు. డీజీపీ తక్షణమే స్పందించి ట్రైనింగ్ తేదీని ప్రకటించి అభ్యర్థులకు పూర్తి వేతనాలు ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. -
టీ ఎస్ఎస్పీ బెటాలియన్‌లో దొంగలు పడ్డారు!
మామునూరు: టీఎస్ఎస్పీ పోలీసుల నివాసగృహాలకే రక్షణ లేకుండా పోయింది. వరంగల్ జిల్లా మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో తాళం వేసి ఉన్న ఎనిమిది క్వార్టర్స్‌ల్లో దొంగలు చోరీకి పాల్పడి 39 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 67తులాల వెండి వస్తువులు, రూ.1.12లక్షల నగదు దొంగిలించారు. హన్మకొండ మండలం మామునూరులో టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లోని సుమారు 7వందల క్వార్టర్స్‌లో పోలీసు కుటుంబాలు నివాసముంటున్నారుు. ఉగాది సందర్భంగా కొంతమంది కానిస్టేబుళ్లు క్వార్టర్లకు తాళాలు వేసి తమ స్వగ్రామాలకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు.