
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుళ్లు కొత్తగా విధుల్లో చేరే ముందు మూడురోజుల సెలవులు దక్కాయి. వీరంతా తమకు కేటాయించిన యూనిట్లలో ఈ నెల 28న ఉదయం రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 బెటాలియన్లలో శిక్షణ పొందుతున్న 3,804 మందికి షెడ్యూల్ ప్రకారం 25వ తేదీన ఉదయం నియామకపత్రాలు ఇవ్వాలి. అలా అయితే, వీరికి మధ్యలో రెండురోజుల గడువు మాత్రమే ఉందని గుర్తించిన అధికారులు 24వ తేదీ సాయంత్రమే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేశారు. దీంతో 25, 26, 27 తేదీల్లో మూడు రోజులు సెలవులు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment