‘చలో డీజీపీ ఆఫీస్’‌కు టీఎస్‌ఎస్పీ అభ్యర్థుల పిలుపు | TSSP Selected Candidates Protest At DGP Office Over Training | Sakshi
Sakshi News home page

‘చలో డీజీపీ ఆఫీస్’‌కు టీఎస్‌ఎస్పీ అభ్యర్థుల పిలుపు

Published Wed, Aug 19 2020 11:57 AM | Last Updated on Wed, Aug 19 2020 12:15 PM

TSSP Selected Candidates Protest At DGP Office Over Training - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్ఎస్పీకి సెలెక్ట్ అయిన అభ్యర్థులు బుధవారం ‘చలో డీజీపీ ఆఫీస్’‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయానికి వచ్చిన తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)‌కు సెలెక్ట్ అయిన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫలితాలు విడుదలయ్యి దాదాపు 9 నెలల అవుతున్న ఇప్పటి వరకు ట్రైనింగ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థులు తెలిపారు. తమతో పాటు సెలెక్ట్ అయిన సివిల్, ఏఆర్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి వేతనాలు ఇస్తున్నారన్నారు. కానీ టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థుల ట్రైనింగ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని వారు వాపోయారు. శిక్షణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది సెలక్ట్ అయిన అభ్యర్థులు చనిపోయారని తెలపారు. డీజీపీ తక్షణమే స్పందించి ట్రైనింగ్ తేదీని ప్రకటించి అభ్యర్థులకు పూర్తి వేతనాలు ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement