
సాక్షి, బెంగళూరు: అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఒక వ్యక్తి తాను చనిపోయినట్లు డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయాడు. ఈఘటన మాండ్య శ్రీరంగపట్టణ తాలూకా బొట్టనహళ్లి గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన మను అనే వ్యక్తి ఫైనాన్స్ కంపెనీ ఏర్పాటు చేశాడు. బయట వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. బాకీ తీర్చాలని ఆసాములు ఒత్తిడి చేయడంతో గత నెల 12 నుంచి కనిపించకుండా పోయాడు. తాను ధరించిన విగ్‌కు కోడి రక్తం పూసి, చెప్పులను కాలువ వద్ద వదిలేసి గోవా వెళ్లాడు.
వాటిని గమనించిన తల్లిదండ్రులు మనుని ఎవరో హత్య చేశారని భావించారు. ఇదిలా ఉండగా సుప్రియ అనే యువతికి రూ. 8 లక్షలు ఇచ్చినట్లు, అందుకు సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వాలని, లేదంటే సినిమా తరహాలో చంపేస్తానని ఓ వ్యక్తి మనును బెదిరించినట్లు ఒక ఆడియో వైరల్ అయింది. దీంతో మను తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి మను బతికే ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. అప్పుల బాధతోనే డ్రామా ఆడినట్లు అంగీకరించాడు.
చదవండి: బెంగళూరులో ఘోరం.. తమ్ముని భార్య వేధిస్తోందని
Comments
Please login to add a commentAdd a comment