
మండ్య: ఓ యువకుడు యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన మండ్య నగరంలోని మండ్య వైద్య కళాశాల ఆవరణంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... మండ్య తాలూకా వై యరహళ్లి గ్రామానికి చెందిన నవ్య (20) మండ్య మిమ్స్ ఎంఆర్‌డీ విభాగంలో పారా మెడికల్ కోర్సు చేస్తోంది.
అదే గ్రామానికి చెందిన తన బంధువు పరమేశ్, నవ్య నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల నవ్య పరమేశ్‌కు దూరంగా ఉంటోంది. దీన్ని సహించలేని పరమేశ్ ఆమెను హత్య చేయాలని పథకం పన్నాడు.
గురువారం మధ్యాహ్నం నుంచి నవ్య కోసం అక్కడే వేచి ఉన్నాడు. 4.30 గంటల సమయంలో నవ్య కళాశాల నుంచి బయటకు రాగా తను వెంట తెచ్చుకున్న బలమైన కట్టెతో దాడి చేశాడు. దీంతో నవ్య తలకు తీవ్రంగా గాయమైంది. అక్కడే ఉన్న విద్యార్థులు పరమేశ్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్ర రక్తస్రావమైన నవ్యను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దుండగున్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment